మాటలు మార్చడంలోకాజల్ దిట్ట

0


kajal-agarwal-hotఅవసరానికి సమయానికి తగ్గట్లుగా మాటలు మార్చేయడం అనే కళ కొందరికి బాగానే అబ్బుతుంది. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం ఈ విషయంలో ఆరితేరిపోయి ఉంటారు. దక్షిణాదిలో స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్.. ముంబై భామ అనే సంగతి తెలిసిందే.

తాను పొరపాటున నార్త్ ఇండియాలో పుట్టానని.. సౌత్ ఇండియాలోనే పుట్టి ఉండాల్సి అంటూ రీసెంట్ గా భారీ స్టేట్మెంట్ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఇదంతా కమిట్మెంట్ అనేసుకోవచ్చు కానీ.. ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితిలోనే ఇలా చెప్పిందని అనచ్చు. ఓ ఐదేళ్ల క్రితం అనుకుంటా.. ‘నన్ను సౌత్ ఇండియన్ అనద్దు.. నేను నార్త్ ఇండియన్ ని’ అంటూ ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఖరాఖండీగా చెప్పింది కాజల్. అప్పట్లో బాలీవుడ్ లో అవకాశాల కోసం బాగా ప్రయత్నాలు చేసేస్తున్న టైం కావడంతో అలా చెప్పింది.

ఆ తర్వాత ఓ మేగజైన్ కోసం టాప్ లెస్ ఫోటో షూట్ చేసింది కాజల్ అగర్వాల్. ఇది హాట్ టాపిక్ అవడంతో.. అది తాను కాదని.. తన ఫోటోను మార్ఫింగ్ చేశారని హంగామా చేసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ మేగజైన్ యాజమాన్యం.. కేసు వేస్తామని బెదిరించండంతో.. చివరకు తనే టాప్ లెస్ పోజ్ ఇచ్చాననే సంగతి ఒప్పుకుంది.

గతేడాది రణదీప్ హుడాతో దో లఫ్జోం కీ కహానీ చేసింది కాజల్. ఈ సినిమాలో లిప్ లాక్ విషయంలో.. ముందుగా తనకు ఆ సీన్ గురించి తెలీదని.. సడెన్ గా రణదీప్ ముద్దెట్టేశాడని చెప్పిన కాజల్.. ఆ తర్వాత స్క్రిప్ట్ లో లేకుండా ఎవరైనా ఎందుకు చేస్తారని మాట మార్చింది. తన అనుమతితోనే ఈ సీన్ తీశారని పలికింది. ఇన్నేసి మాటలు మార్చడం చూస్తే.. కాజల్ కి సినిమా రాజకీయాలు బాగానే అబ్బినట్లున్నాయి. రియల్ పాలిటిక్స్ లో కూడా ట్రై చేస్తే బెటరేమో కదా!