చల్లటి కొండల మధ్య చందమామ

0kajal-agarwal-hotఒకప్పుడిు తెలుగులో హిరోయిన్లుకు కొంచం కొదవ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అనే చెప్పాలి. ఎందుకంటే సౌత్ లో ఇప్పుడు యంగ్ హిరోయిన్లు చాలామంది వస్తున్నారు మరి ఇలాంటి అప్పుడు ఆఫర్లు రావడం కూడా కష్టమే కదా. వచ్చినప్పుడు వాటిని జాగ్రతగా మలుచుకోవడం తెలియాలి. కాజల్ కు ఇది బాగానే తెలిసినట్లు ఉంది.

ఏప్రిల్ ఎండలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరుకు కాజల్ యూరోపియన్ దేశాలలో భలే చల్లటి కొండలు మధ్య చక్కని చల్లని నగరాలలో ఆడుతూ పాడుతూ గడుపుతుంది. సెర్బియా పోలాండ్ మాసిడోనియా లాంటి అందమైన ఘాటి ప్రాంతాలలో వేసవి కాలం ఎంజాయ్ చేస్తుంది చందమామ. అమ్మడేమీ వేసవి తాపంకు భయపడి అక్కడుకు వెళ్లలేదు.. షూటింగ్ విషయంగా అక్కడకు వెళ్లింది. ఇక్కడ మన ఎండ నుండి తప్పించుకుంది అక్కడ తన పనికూడా జరిగిపోతుంది. భలే ఛాన్స్ కొట్టేసింది కాజల్.

అజిత్ సినిమా ‘వివేగం’ షూటింగ్ ఇప్పుడు సైబీరియన్ చుట్టుపక్కల ప్రాంతాలలో జరుగుతుంది. ఇంకో పాట స్కోప్జే సిటీ వ్యాలి లో షూటింగ్ జరుగుతుంది దీన్ని వెనువెంటనే హీరో విజయ్ సినిమా కోసం పోలాండ్ వెళ్లనుంది. మన హైదరాబాద్ లో ఎండ 40 ప్లస్ డిగ్రీలు దాటుతుంది. ఈ విషయం లో తన తోటి హిరోయిన్లుతో పోల్చుకుంటే తెలివిగా వేసవిలో షూటింగ్ యూరోపియన్ దేశాలలో ప్లాన్ చేసి ఇక్కడ భానుడు భగ భగ లు బారినుండి తప్పించుకుంది. అజిత్ విజయ్ వలనా కాజల్ ఇంకా ఆ సినిమా యూనిట్ మన దేశపు వేసవి వేడి నుండి రక్షించబడ్డారు అనే చెప్పాలి.