నయనతార బాటలో కాజల్‌

0kajalagarwal-in-nayanatara-నయనతార, త్రిషల బాటలో పయనించడానికి నటి కాజల్‌ అగర్వాల్‌ సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. 10ఏళ్లు +50 చిత్రాలు = అగ్ర కథానాయకి. ఇదీ క్లుప్తంగా నటి కాజల్‌అగర్వాల్‌ కేరీర్‌. కోలీవుడ్‌లో బోమ్మలాట్టం చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజా ద్వారా నటిగా మలచబడిన ఉత్తరాది భామ కాజల్‌. చాలా చిత్రాల్లో గ్లామర్‌కే పరిమితం అయిన ఈ బ్యూటీలోని ప్రతిభను వెలికి తీసిన చిత్రం మగధీర అని చెప్పవచ్చు. అప్పటి వరకూ కోలీవుడ్‌లో ఫేమ్‌లేని ఈ అమ్మడికి గుర్తింపునిచ్చిన చిత్రం అదే అవుతుంది.

ఆ తరువాత కోలీవుడ్‌లో విజయ్‌తో తుపాకీ, జిల్లా లాంటి చిత్రాలలో నటించే అవకాశాలను అందుకుని టాప్‌ హీరోయిలన్ల లిస్ట్‌లో చేరింది. ప్రస్తుతం అజిత్‌కు జంటగా వివేగం చిత్రాన్ని పూర్తి చేసి, విజయ్‌తో మెర్సల్‌ చిత్రం చేస్తోంది. కాగా ఆదిలో ఇలా నటించిన నటి నయనతార, త్రిషలు ఆ తరువాత స్టార్‌డమ్‌ తెచ్చుకుని హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రాల స్థాయికి ఎదిగారు. తాజాగా నటి కాజల్‌అగర్వాల్‌కు అలాంటి అవకాశం తలుపుతట్టిందన్న టాక్‌ సోషల్‌ మీడియాలో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నుంచి దాదాపు అందరు హీరోలతోనూ దక్షిణాది భాషలన్నిటిలోనూ చిత్రాలు చేసిన సీనియర్‌ దర్శకుడు పీ.వాసు తెరకెక్కించిన శివలింగ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆయన తాజా చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ సారి హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్రతో కూడిన విభిన్న కథా చిత్రాన్ని తమిళం, తెలుగు భాషలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇందులో నటి కాజల్‌ అగర్వాల్‌ను కథానాయకిగా ఎంచుకున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే ఈ చిత్రం కాజల్‌అగర్వాల్‌ నట కేరీర్‌ను మరో మలుపు తిప్పే చిత్రం అవుతుందని వేరే చెప్పక్కర్లేదు.