ఆ రేంజులో కాజల్ నటించగలదా?

0


kajal-agarwal-hotకాసినన్ని సీన్లలో హడావుడి చేయడం.. రెండు పాటల్లో స్టెప్పులు వేయడం.. ఎక్కడ గ్లామర్ ఆరబోయాలి అనేది చూసుకోవడం.. అంతే.. స్టార్ హీరోయిన్ రోల్ అక్కడితో అయిపోయింది. మన సినిమాల్లో దాదాపు స్టార్ హీరోయిన్లు అందరికీ అలాంటి రోల్సే వస్తున్నాయి. కాని చాలా రేర్ గా సమంతకు ఒక అ.ఆ.. రకుల్ కు ఒక రారండోయ్ వంటి రోల్స్ పడుతుంటాయ్. అయితే ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకనేగా.. అక్కడికే వస్తున్నాం.

హింది సినిమా క్వీన్ లో కంగానా రనౌత్ అద్భుతమైన నటనతో సినీ ప్రేక్షకులు హృదయాలలో క్వీన్ గా నిలిచిపోయింది. ఆమెకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను సౌత్ లో తెలుగు – తమిళ్ – కన్నడ వర్షన్ లో కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ చేయబోతోంది అని తెలుస్తుంది. ఈమె కన్నా ముందు తమన్నాను అనుకున్నారు కానీ రెమ్యూనరేషన్ సెట్టవ్వక వదిలేశారు. కాని ఈ పాత్ర పోషించడానికి కాజల్ కు అంత సీన్ ఉందా ఇంతవరకు ఏ సినిమాలోను తను నటనతో మెప్పించి ముందుండి నడిపించే సినిమాలు కాజల్ చేయకపోవడమే దానికి కారణం. తను చేసిన సినిమాలు అన్నీ దాదాపుగా కమర్షియల్ సినిమాలే గ్లామర్ పాత్రలే. మొత్తం నటనే ప్రధానంగా సాగే క్వీన్ సినిమాలో కాజల్ ఎలా చేయగలుగుతుంది అనేది ఇప్పుడు అందరి మదిలో మాట.

అల్లరి పిల్లగా ఏదో కొన్ని ప్రేమ పాటలు పాడటం తప్పితే నటనతో మెప్పించే సినిమాలు ఏమి చేయలేదు. కనీసం తమన్నాను పెట్టుకున్నా బాగుండేది అనే అభిప్రాయం వినిపిస్తోంది. లేదంటే సమంత. నిత్యా మీనన్. బెటర్ చాయిసెస్ అయ్యేవారు. మరి కాజల్ ను ఎందుకు ఎంచుకున్నారో ఆ దర్శక నిర్మాతలకే తెలియాలి. చూద్దాం ఆమె ఏం చేస్తుందో!!