చందమామ.. పండువెన్నెల!

0

యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న గెటప్స్ లో కన్పిస్తాడనే సంగతి తెలిసిందే. అందులో ఒకటి యంగ్ లుక్ కాగా మరొకటి సాల్ట్ అండ్ పెప్పర్ బియర్డ్ గెటప్ లో కనిపించే డాన్ లుక్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. కాజల్ అగర్వాల్.. కళ్యాణి ప్రియదర్శన్.

ఈ సినిమాలో మెజారిటీ పోర్షన్ స్పెయిన్లో చిత్రీకరణ జరుపుతున్నారు. గతంలో ఒకసారి లాంగ్ షెడ్యూల్ స్పెయిన్ లో జరిగింది. తాజాగా మరోదఫా స్పెయిన్ షెడ్యూల్ ప్రారంభం కావడం.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ జాయిన్ కావడం జరిగింది. దీంతో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఆన్ లొకేషన్ స్టిల్ ను షేర్ చేసింది. ఈ ఫోటోకు “#టిట్ బిట్. సుధీర్ వర్మ వ్యాలెన్షియా లో ఫిలిం షూట్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఫోటోలో లెఫ్ట్ సైడ్ బియర్డ్ లుక్ లో ఉన్న శర్వా కూర్చొని కాజల్ ను చూస్తూ ఉన్నాడు. కాజల్ బ్రౌన్ – క్రీమ్ కలర్ కాంబినేషన్ గౌన్.. పైన చాకొలేట్ కలర్ పుల్ ఓవర్ వేసుకొని చేతిలో వైట్ కలర్ టీ కప్ పట్టుకొని ఉంది. మొహం మాత్రం ఎలా పెట్టిందంటే.. రెండు కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తే టూత్ పేస్ట్ యాడ్ కు పోజు పెడుతుంది చూడండి.. సరిగ్గా అలానే పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ ఓ ఝకాస్ పోజిచ్చింది. లైటింగ్ కూడా బ్రైట్ గా ఉండడంతో ఫోటో అదిరిపోయిందంతే. పౌర్ణమి రోజు చందమామ పండు వెన్నెలలా ఉంది. ఈ ఫోటోకు ఒక్కరోజులోనే నాలుగున్నర లక్షల లైకులు వచ్చాయి.
Please Read Disclaimer