కాజల్-బెల్లంకొండ కాంబో ఒన్స్ మోర్!

0

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘కవచం’. శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తో పాటుగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా బెల్లంకొండ శ్రీనివాస్-కాజల్ జంట గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే మూడోసారి కూడా ఈ కాంబో రిపీట్ కానుందట.

‘కవచం’ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ కాజల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. శ్రీనివాస్ తో వర్క్ చేయడం ఎంతో కంఫర్టబుల్ గా ఉంటుందని.. తనతో ఎన్ని సినిమాలైనా చేయవచ్చని చెప్పింది. శ్రీనివాస్ తో కలిసి మరో సినిమా చేయబోతున్నానని తెలిపింది. కానీ ఆ సినిమా డీటెయిల్స్ మాత్రం వెల్లడించలేదు. ఇంకా ఆ ప్రాజెక్టు చర్చల దశలో ఉందని.. ఫైనలైజ్ అయిన తర్వాత ఇతర వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.

శ్రీనివాస్ మొదటి నుండి స్టార్ హీరోయిన్లతోనే పని చేశాడు. ఇప్పుడు కాజల్ తో వరసగా మూడు సినిమాలంటే గొప్ప విషయమే. మరి ఈ జోడీ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి. ‘కవచం’ హిట్ అయితే మాత్రం అనుమానం లేకుండా ఈ జోడీకి క్రేజ్ పెరుగుతుందనడం లో సందేహం లేదు.
Please Read Disclaimer