చందమామ విలనీ

0

చూడటానికి అమాయకంగా కనిపిస్తుంది. సాఫ్ట్ ఏమో అనుకుంటాం! కానీ ముఖానికి రంగేసుకున్నాక.. ఆ తర్వాత ఉంటుంది అసలు మజా! తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేయడం కాజల్ స్టైల్. చందమామలో ఎంతో అమాయక ప్రేమికురాలిగా ముద్దొచ్చే పాత్రలో కుర్రాళ్ల గుండెల్ని గిల్లేసే రొమాంటిక్ గాళ్ గా కనిపించిన కాజల్.. ఈసారి ఎవరూ ఊహించనంత కొత్తగా కనిపిస్తుందిట. అది కూడా తన కెరీర్ లో మునుపెన్నడూ లేనంత క్రూరంగా కనిపించి సర్ ప్రైజ్ చేస్తుందిట. ఇంతకీ ఏ సినిమాలో? అంటారా..

కాజల్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన తేజ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కాంబోడియాలోని ఎగ్జోటిక్ లొకేషన్లలో జరుగుతోంది. అక్కడి నుంచి గత రెండ్రోజులుగా రకరకాల ఫోటోలు అంతర్జాలంలో లీకయ్యాయి. ఈ ఫోటోల్లో అరుదైన చారిత్రక లొకేషన్లు ఉన్నాయి. ఒకానొక ఫోటోలో కాజల్ .. బెల్లంకొండ భుజాలపైకి ఎక్కి చిలౌట్ చేస్తూ కనిపించింది.

అయితే కాజల్ ఎంత చిలౌట్ గా కనిపిస్తుందో తన పాత్రలో అంతటి నెగెటివిటీ ఉండడమే ఈ సినిమాలో అసలు సిసలు సర్ ప్రైజ్ అని తెలుస్తోంది. బిజినెస్ అంటేనే కర్కశత్వం. పోటీని ఎదుర్కొనే క్రమంలో శత్రువుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ కోవలో చూస్తే తనో కర్కశ బిజినెస్ మ్యాగ్నెట్ గా తెరపై కనిపించబోతోందిట. మరి ఆవిడతో బెల్లంకొండ లవ్ లో పడ్డాక ఏం జరిగింది? అసలు కాజల్ ఇచ్చే షాకింగ్ ట్విస్టులేంటి? అన్నది తెరపై చూడాల్సి ఉంటుంది. కాజల్ ఈ సినిమాతో పాటు `ప్యారిస్ ప్యారిస్` అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ క్వీన్ చిత్రానికి రీమేక్ ఇది.
Please Read Disclaimer