కోటి రూపాయలకు ‘నో’ అన్న బ్యూటీ!

0కొందరికి వందెక్కువ.. కొందరికి వెయ్యి.. మరి కొందరికి లక్ష.. ఇలా మారుతూ ఉంటుంది. కానీ ఇప్పటికీ కామన్ జనాలకు కోటి రూపాయలు పెద్ద మొత్తమే. కానీ బ్యూటిఫుల్ కాజల్ మాత్రం తనకొచ్చిన కోటి రూపాయల ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. ఇంతకీ ఆ కోటి వాళ్ళెందుకు ఇస్తామన్నారు… ఈవిడెందుకు వద్దని చెప్పిందో చూద్దాం.

నీలేష్ అనే యువ హీరోను తెలుగుతెరకు పరిచయం చేస్తూ సీనియర్ డైరెక్టర్ జయంత్ సి. పరాన్జీ ఒక సినిమాను తెరకక్కిస్తున్నాడట. ఈ సినిమా టైటిల్ ‘నరేంద్ర’. షుమారుగా పది కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు కాస్త గ్లామర్ టచ్ ఇచ్చేందుకు ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడట జయంత్. అందుకోసం టాలీవుడ్ చందమామ అయిన కాజల్ ను సంప్రదించాడట. జస్ట్ మూడు రోజుల కాల్ షీట్స్.. కోటి రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా కాజల్ మాత్రం ఒప్పుకోలేదట.

కాజల్ ఈమధ్య వరస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఐటెం నెంబర్స్ కనుక యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రభావం తన కెరీర్ పై పడే అవకాశం ఉంటుందని వెనకడుగు వేసిందట. కారణం ఏదైనా తెలుగు ప్రేక్షకకులు మరో ‘పక్కా లోకల్’ మిస్సయినట్టే!