శర్వా- సుధీర్ వర్మ కోసం డా. కాజల్ రెడీ

0పదేళ్ళకు పైగా గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగడం అనేది సాధారణ విషయం కాదు. ఫిట్ నెస్ – గ్లామర్ ను కాపాడుకుంటూ కొత్తగా వచ్చే కాంపిటీషన్ ను తట్టుకుంటూ ఇలా కొనసాగాలేంటే హార్డ్ వర్క్ తో పాటు మంచి యాటిట్యూడ్ కూడా ముఖ్యమే. అది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు ఫుల్లుగా ఉంది.

రీసెంట్ గా హిందీ ‘క్వీన్’ తమిళ రిమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ ను కంప్లీట్ చేసిన ఈ చందమామ గ్యాప్ తీసుకోకుండా వెంటనే సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శర్వానంద్ సినిమా షూటింగ్ లో వాలిపోయిందట. ఈ సినిమాలో శర్వా కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఈ సినిమాలో రెండు కాలాల్లో సాగుతుందట. ఓల్డ్ టైం ఫ్రేమ్ లో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ అయితే.. ప్రస్తుత కాలంలో శర్వాతో కాజల్ జత కడుతుందట.

ఈ సినిమాలో కాజల్ ఒక డాక్టర్ పాత్రలో కనిపిస్తుందని సమాచారం. డాక్టర్ గా పేషెంట్లకి మందులిస్తుందో లేక శర్వాను తన మాయలో పడేస్తుందో వేచి చూడాలి. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు.