పెద్దమ్మ కాజల్ అగర్వాల్ తో

0పదకొండేళ్ల క్రితం దర్శకుడు తేజ ద్వారా కళ్యాణ్ రామ్ సరసన లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన కాజల్ అగర్వాల్ ఇంకా ఫామ్ కొనసాగిస్తూనే ఉంది. పెళ్లి గురించి అడిగితే ఇంకా చాలా టైం ఉందని దాటవేస్తోంది కానీ చెల్లెలు నిషా అగర్వాల్ పుణ్యమా అని గత నవంబర్ లో పెద్దమ్మగా ప్రమోషన్ కొట్టేసింది. నిషా అగర్వాల్ బుడ్డోడి పేరు ఇషాన్ వలేచ. పుట్టినప్పుడే తన సంతోషాన్ని చెల్లి కొడుకుకి ముద్దు పెట్టడం ద్వారా షేర్ చేసుకున్న కాజల్ అగర్వాల్ ఆరు నెలలు దాటాక బుల్లి అగర్వాల్ ఎలా ఉంటాడో ఫోటోల రూపంలో అభిమానులకు షేర్ చేస్తోంది. నిషా అగర్వాల్ కూడా తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఏమైంది ఈ వేళా-సోలో లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తన ఖాతాలో ఉన్నాయి కానీ ఎక్కువ కాలం కెరీర్ లో కొనసాగలేక పెళ్లి చేసుకుని కుటుంబ జీవితానికి అంకితం అయిపోయింది. అక్క కంటే ముందే పెళ్లి చేసుకుంది కాబట్టి తల్లిగా కూడా మొదట బాధ్యత స్వీకరించింది.

అందుకే కాజల్ ఆనందం మామూలుగా లేదు. వీలు కుదిరినప్పుడంతా ఇషాన్ తో ఆడుకుంటూ ఫోటోల మీద ఫోటోలు దిగేస్తోంది. తన కళ్ళలో ఆ మెరుపుని గమనించవచ్చు కూడా. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్ లో బిజీ గా ఉంది. రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫినిషింగ్ స్టేజిలో ఉంది. తెలుగు వెర్షన్ నీలకంఠ దర్శకత్వంలో తమన్నా హీరోయిన్ గా మొదలుపెట్టారు కానీ దానికి సంబంధించిన అప్ డేట్స్ అయితే ఆగిపోయాయి. గత ఏడాది నేనే రాజు నేనే మంత్రి-ఖైదీ నెంబర్ 150 ద్వారా రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న కాజల్ ఇటీవలే చేసిన ఎమ్మెల్యే ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. పారిస్ పారిస్ అ!! తరహాలో నటనకు చాలా స్కోప్ ఇచ్చిందని దీని ద్వారా నటిగా మరో పది మెట్లు ఎక్కేసినట్టే అని ఆనందంగా చెబుతోంది. బాగుంది. ఒకపక్క చెల్లి కొడుకు మరోపక్క క్వీన్ రీమేక్ ఆనందం. బాగా ఎంజాయ్ చేస్తోంద