కాజల్ ను పెళ్లి చేసుకోబోయేది ఇతనే.. ఎవరో తెలుసా

0kajal-agrawal-husbandఎంతటి స్టార్ హీరోయిన్ అయినా… ఎప్పుడో ఒకప్పుడు లైఫ్ పార్టనర్‌ను వెతుక్కోవాల్సిందే. కొందరు హీరోయిన్లు ఈ విషయంలో కాస్త తొందరపడితే… మరికొందరు మాత్రం ముదిరిపోయే వరకు వెయిట్ చేస్తుంటారు. తనకంటే ముందే తన చెల్లెలు నిషా అగర్వాల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్… త్వరలోనే తాను కూడా పెళ్లి చేసుకోవడానికి ఓ ప్రియుడిని వెతుక్కున్నట్టు గుసగుసలు వినిస్తున్నాయి. ఇండస్ట్రీలోని స్టార్స్ తో లవ్ ఎఫైర్లకు దూరంగా ఉంటూ వచ్చిన కాజల్… ఎక్కువగా కెరీర్ పైనే ఫోకస్ పెట్టి హీరోయిన్‌గా సక్సెస్ సాధించింది. ఇప్పటికీ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. దీంతో ఇప్పుడప్పుడే కాజల్ పెళ్లి గురించి ఆలోచించదేమో అని అనుకున్నారు చాలామంది. అయితే…

కొంతకాలంగా ఓ బిజినెస్ మేన్‌తో ప్రేమాయణం సాగిస్తున్న ముద్దుగుమ్మ.. అతడితో ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉందట. దేశవ్యాప్తంగా ఉన్న హోటల్స్ గ్రూప్‌కు ఓనర్ అయిన ఓ బిజినెస్ మేన్ ఎవరనే విషయాన్ని మాత్రం కాజల్ చాలా సీక్రెట్‌గా ఉంచుతోందట. సమయం వచ్చినప్పుడు అతగాడెవరో చెప్పేసి, వెంటనే పెళ్లి పీటలు ఎక్కేయాలని అమ్మడు భావిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ టాలీవుడ్ చందమామ.. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటుందా లేక వచ్చే ఏడాది వరకు తన ప్రియుడిని వెయిటింగ్‌లో పెడుతుందా అన్న విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. మరి కాజల్ తన ప్రేమాయణాన్ని ఎప్పుడు లీక్ చేస్తుందో చూడాలి.