ఇద్దరు బిగ్ బాస్ విన్నర్స్ కాజల్ బావలే!

0

Kajal-Agerwal-Link-with-shiva-Balaji-and-Kaushalతెలుగు బిగ్ బాస్ విజయవంతంగా రెండు సీజన్ లను ముగించుకుంది. మొదటి సీజన్ విజేత శివ బాలాజీ కాగా రెండవ సీజన్ విజేతగా కౌశల్ నిలిచిన విషయం తెల్సిందే. తెలుగు రెండు సీజన్ ల విజేతలకు స్టార్ హీరోయిన్ కాజల్ కు ఒక రిలేషన్ ఉంది. ఈ ఇద్దరు కూడా రెండు సినిమాల్లో కాజల్ కు బావ పాత్రల్లో నటించారు. సోషల్ మీడియాలో రకరకాలుగా ఈ విషయమై మీమ్స్ వస్తున్నాయి. ఒకొక్కరు ఒక్కోరకంగా క్రియేటివిటీతో సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక మీమ్ తెగ సందడి చేస్తుంది. అదే ఈ కాజల్ కు బిగ్ బాస్ విన్నర్ కు ఉన్న సంబంధం మీమ్. చందమామ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రంలో శివబాలాజీ కీలక పాత్రలో కనిపించాడు. మొదట శివబాలాజీకి కాజల్ కు వివాహం ఫిక్స్ అవుతుంది. కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యి కాజల్ కు శివబాలాజీ బావ అవుతాడు.

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ తో కూడా కాజల్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రంలో నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కౌశల్ కీలకమైన పాత్రలో కనిపించాడు. ఇలా కాజల్ కు బావగా నటించిన ఇద్దరు కూడా బిగ్ బాస్ విన్నర్స్ గా నిలవడంతో తర్వాత సీజన్ లో కూడా కాజల్ కు బావగా నటించిన వారే విన్నర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. కాజల్ ఫ్యాన్స్ తో పాటు సినీ జనాలు కూడా ఈ మీమ్స్ను వైరల్ చేస్తున్నారు. యాదృచ్చికంగా జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Please Read Disclaimer