కాజ‌ల్ డేటింగ్ స్టార్ట్ చేసిందా..!

0

kajalటాలీవుడ్ మిత్రవింద అంటూ అంద‌రూ ముద్దుగా పిలుచుకొనే కాజ‌ల్ అగ‌ర్వాల్‌కి ల‌వ‌ర్ దొరికాడు. కాజ‌ల్ ఫిల్మ్ కెరీర్ మంచి ఫాంలో ఉంది, కాని ఈ బ్యూటీకు ఇంకా ల‌వ‌ర్ ట‌చ్ కాలేదా అని అంద‌రూ అనుకుంటున్నారు. కాక‌పోతో గ‌త సంవ‌త్సర‌కాలంగా కాజ‌ల్ ఓ ల‌వ‌ర్‌ను సీక్రెట్‌గా మెయింటెన్ చేస్తుంద‌ని ఎవ‌రికి తెలియ‌లేదు. రీసెంట్ ఓ అభిమాని కాజ‌ల్ పెళ్లి గురించి అడిగితే నాకు అప్పుడే తొంద‌ర‌లేదంటూనే, నాకు న‌చ్చే మ‌గాడు రావాలి క‌దా. నా అభిప్రాయాల‌ను గౌర‌వించే వాడు దొరికితే చూస్తాను అంటూ అభిమానికి చెప్పింది.

రీసెంట్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌, చెల్లి నిషా అగ‌ర్వాల్ ఇద్దరూ ఫారిన్ ట్రిప్‌ను తెగ ఎంజాయ్ చేశారు. ఆ ట్రిప్‌లో కాజ‌ల్ ల‌వ‌ర్ కూడ ఫారిన్‌లో జాయిన్ అయ్యాడ‌ని టాలీవుడ్ విశ్వశ‌నీయ‌మైన స‌మాచారం. కోళీవుడ్ తుపాకి మూవీ షూటింగ్‌ స‌మ‌యంలో కాజ‌ల్‌కి ఓ ఎన్‌.ఆర్‌.ఐ బిజినెస్‌మెన్‌తో పరిచాయాలు ఏర్పడ్డాయి. త‌ను బొంబే కు సంబంధించిన వ్యక్తి కావ‌డంతో, కాజ‌ల్‌ది కూడ నేటివ్ మ‌హారాష్ట్ర అవ‌డంతో ఇద్దరి మ‌ధ్య కెమిస్ట్రి పెరిగింద‌ని తాజా స‌మాచారం.

అయితే వీరిద్దరి మ‌ధ్య డేటింగ్ అంటూ ఏమి లేక‌పోయినా, వీరి ప‌రిచ‌యం దాదాపు అదే దిశ‌లో కొన‌సాగుతుంద‌ని టాలీ టాక్‌. ఏదిమైనా ఇంకా ఫిల్మ్‌కెరీర్‌ను సంపూర్ణంగా ఎంజాయ్ చేయాల‌నుకున్న కాజ‌ల్‌కి పెళ్లి ఆలోచ‌న‌లు లేక‌పోయిన్నప్పటికి ల‌వ‌ర్‌తో డేటింగ్ వ‌ర‌కూ వెళ్ళే ఛాన్స్ ఉంద‌ని, అది ముదిరితే పెళ్లి ఖాయం అని అంటున్నారు అంద‌రూ.

kajal agarwal, kajal agarwal news, kajal agarwal marriage, kajal agarwal dating news, kajal agarwal Images, కాజ‌ల్ డేటింగ్ స్టార్ట్ చేసిందా..!