టైటిలేంటి? ఈ రొమాన్స్ ఏంటి?

0nene-raju-nene-mantris-releచాలా సినిమాల్లో రొటీన్ గా జరిగే ఒక మిస్టేక్ ఏంటంటే.. అసలు సినిమా టైటిల్ ఏంటో దానిలోపల ఉండే కతేంటో అన్నట్లుగా ఉంటాయి. అందుకే అలాంటి సినిమాలకు రిజల్టు తేడాపడుతూ ఉంటుంది. ఊసరవెల్లి అనే సినిమాకు టైటిల్ ఇంకేదైనా పెట్టుంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో. అంతెందుకు.. తేజ మొన్నామధ్యన నీకూ నాకూ డ్యాష్ డ్యాష్ అని టైటిల్ పెట్టాడు. ఈ డ్యాష్ డ్యాష్ అంటే సినిమా లోపల నిజంగానే మితిమీరిన శృంగారం ఏదైనా చూపించాడేమోనని ఆడియన్స్ డిస్ కనక్ట్ అయ్యారు. ఇక సినిమా రిలీజయ్యాక డ్యాష్ డ్యాష్ కట్టయినా కూడా పెద్దగా లాభం ఏముంటుంది? సినిమా ఒక ప్రేమకథ అని తెలిసేనాటికి ధియేటర్స్ నుండి ఎగిరిపోయింది.

ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. తేజ లేటెస్ట్ సినిమా పేరు ”నేనే రాజు నేనే మంత్రి”. దానికి తగ్గట్టే మొదటి టీజర్ కూడా ఏదో ఊరికంపం ఎక్కుతున్న హీరో క్యారక్టర్ ను చూపించి ఇంప్రెస్ చేశాడు. అలాగే పోస్టర్లు కూడా బాగున్నాయి. కాని సడన్ గా ఎక్కడి నుండి వచ్చిందో ఈ ఐడియా తెలియదు కాని.. రాధతో జోగేంద్రం అంటూ మనోడు కాజల్ ను వెనుకనుండి గట్టిగా హగ్ చేసుకుని రొమాన్స్ చేస్తున్న పోస్టర్లను రిలీజ్ చేశారు. అక్కడి నుండి రొమాంటిక్ ప్రచారమే మొదలెట్టారు. అసలు కాజల్ కు పెద్దపీట వేస్తూ ఈ రొమాంటిక్ ప్రచారమేంటి తేజా గారూ? సినిమా టైటిల్ ను బట్టి సినిమా కంటెంట్ ను ప్రమోట్ చేస్తే బాగుంటుంది కాని.. టైటిల్ ఒకటి పెట్టి ఇక్కడ మాత్రం వేరొకదానిపై ఫోకస్ పెడితే మరోసారి ఫ్యూజ్ కొట్టేసే షాకుందండీ.. మీరది గమనించారా?

ఇకపోతే ఆగస్టు 11న విడదల అవ్వాల్సిన నేనే రాజు నేనే మంత్రి సినిమాను 25కు పోస్ట్ పోన్ చేస్తున్నారనే వార్తను ఆల్రెడీ చెప్పుకున్నాం. కాకపోతే ఆ విషయం ఇంకా సురేష్ బాబు కన్ఫామ్ చేయలేదు. అది సంగతి.