ఐఫాలో పిచ్చెక్కించిన కాజల్‌..!

0kajal-at-iifa-awardతెలుగులో ఆడిపాడే కథానాయికల్లో చాలా వరకు ముంబై భామలే. వాళ్లు  ఇక్కడి సినిమాలతో పేరు తెచ్చుకొని మళ్లీ బాలీవుడ్‌కి వెళుతుంటారు. అయితే అక్కడ మాత్రం వీళ్లని డౌన్‌సౌత్‌ అమ్మాయిలంటూ కాసింత చిన్నచూపే చూస్తుంటారు. మేం మేడిన్‌ ముంబై అని మొత్తుకొన్నా సరే… వీళ్లకి దక్కే పారితోషికాలు కానీ, గుర్తింపు కానీ, గౌరవం కానీ కాస్త తక్కువే ఉంటుంది. సౌత్‌ నుంచి వచ్చిన కథానాయికల కంటే మేం అన్ని విధాలా ముందున్నాం అన్నట్టు బాలీవుడ్‌ భామలు కూడా పోజులు కొడుతుంటారు. కొత్త కొత్త ఫ్యాషన్స్‌తో అదరగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే ఏ వేడుకలోనైనా  బాలీవుడ్‌ భామలుగా గుర్తింపు పొందిన స్థానిక కథానాయిలకదే హంగామా కనిపిస్తుంటుంది. కానీ ఇదివరకటితో పోలిస్తే ఇటీవల కథానాయికల అక్కడి భామల జోరుకు కాస్త కళ్లెం వేస్తున్నట్టే కనిపిస్తున్నారు. తమన్నా, కాజల్‌, తాప్సిలాంటి అందగత్తెలు ఫ్యాషన్స్‌లో మేమూ ఒకడుగు ముందే ఉన్నాం అని నిరూపిస్తూ పలు వేదికలపై అదరగొడుతుంటారు. తాజాగా కాజల్‌ మరోసారి ఆ విషయాన్ని నిరూపించింది. ఐఫా 2015 ముగింపు వేడుకలో కాజల్‌ ఫ్యాషన్‌ డ్రెస్సులేసుకొని హొయలు పోయింది. బాలీవుడ్‌ భామలకి ఏమాత్రం తీసిపోం అన్నట్టుగా అక్కడ సందడి చేసింది. బ్యాక్‌లెస్‌ గౌన్‌తో ఆమె కనిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. మిగతా ఏ కథానాయికకీ రానంత అప్లాజ్‌ ఆమె వేదికని ఎక్కినప్పుడు వచ్చిందట. అన్నట్టు మన వెంకీ, శ్రియాశరణ్‌ కూడా ఐఫా వేడుకకి సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. శ్రియ కట్టుకొన్న చీర అయితే మరింత సెక్సీగా కనిపించిందట. మొత్తమ్మీద ఐఫా వేడుకలో సౌత్‌ తారలు వేడి పుట్టించారన్నమాట.