శ్రీవారిని దర్శించుకున్న కాజల్..

0సినీ నటి చందమామ ఫేమ్ కాజల్ అగర్వాల్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కాజల్ శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంది. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.

ఈ సందర్బంగా కాజల్ మాట్లాడుతూ..స్వామి వారిని దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈమె బెల్లంకొండ శ్రీనివాస్, శర్వానంద్ సినిమాలతో పాటు తమిళంలో క్వీన్ చిత్రం రీమేక్ లో నటిస్తుంది. ఇటీవల ఈమె కళ్యాణ్ రామ్ సరసన ఎంఎల్ఏ మూవీ తో వచ్చి చక్కటి విజయాన్ని అందుకుంది.