మేనేజర్ అరెస్ట్ పై కాజల్ స్పందన

0డ్రగ్స్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన రోని, గతంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు మేనేజర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే కేసులో పలువురు స్టార్ సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తుండటంతో రోని అరెస్ట్ పై కాజల్ స్పందించింది. ‘ రోని ఇన్సిడెంట్ నన్ను షాక్ కు గురిచేసింది. సమాజానికి హాని కలిగించే ఎలాంటి చర్యలకు నేనే మద్ధతివ్వను, ఈ విషయంలో కూడా సపోర్ట్ ఏమాత్రం లేదు.

నా కోసం పని చేసేవారి పట్ల నేను ఎంతో అభిమానంగా ఉంటాను. అంతేగాని వారి వ్యక్తిగత జీవితాన్ని నేను నియంత్రించలేను. నా కెరీర్ గురించి ఎక్కువగా మా అమ్మా నాన్నలే జాగ్రత్తలు తీసుకుంటారు. నటన పరంగా అందరితో స్నేహపూర్వకంగా ఉంటా. కానీ వాళ్ల అలవాట్ల గురించి నాకు తెలియదు. సినిమాలకు సంబంధించి రకరకాల వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. సినిమా పూర్తయిన తరువాత ఎవరితోనూ ఎక్కువగా కలవను.’ అంటూ ట్విట్టర్ లో సుధీర్ఘ వివరణ ఇచ్చింది కాజల్.