బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్న ముద్దుగుమ్మలు

0kajal-samantha-and-shruti-hసమంత-కాజల్.. బ్యాక్ టు బ్యాక్ ఎటాక్! సినిమా హీరోయిన్స్ తో.. అందులో స్టార్ స్టేటస్ అందుకున్న భామలతో బ్రాండ్ అండార్స్ మెంట్స్ కుదుర్చుకోవడం.. తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించుకోవడం ఎప్పటి నుంచో ఉన్న ట్రెండే. సాధారణంగా ఒక్కొక్కరు ఒక్కో టైమ్ లో పీక్ స్టేజ్ లో ఇలా యాడ్స్ ఇరగదీస్తుంటారు.

కానీ ఇప్పుడు మాత్రం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అంతా వరుసపెట్టి దాడి చేసేస్తున్నారు. ఇప్పుడు తెలుగింటి కోడలుగా మారుతున్న సమంత.. సాఫ్ట్ డ్రింక్ మాజా యాడ్ లో కనిపిస్తోంది. కాన్సెప్ట్ ఎప్పటిలాగే ఉంటుందిలే. మామిడిపళ్ల సీజన్.. దానికి సమంత పరిష్కారం చూపించడం అనే థీమ్ తోనే సాగుతుంది. కానీ ఈ యాడ్ లో సమంత అందాలే.. మామిడిపళ్ల తియ్యదనాన్ని మించిపోయాయి. సమంతతో పాటు కాజల్ కూడా కోకోనట్ ఆయిల్ పారాచూట్ ప్రకటనలో కనిపిస్తోంది. కంప్లీట్ గా కాజల్ అందం చుట్టూనే బేస్ అయింది ఈ ప్రకటన. క్లోజప్ షాట్స్ తో చూపించడంతో.. కాజల్ మేని మెరుపులు స్పష్టంగా కనిపిస్తాయి.

ఈ రెండు ప్రకటనలు టీవీల్లో బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాయి. గతంలో శృతి హాసన్ నటించిన ఫాంటా యాడ్ కూడా ఇప్పుడు మళ్లీ ఎక్కువగా టెలికాస్ట్ అవుతోంది. ఈ యాడ్ లో శృతి డ్యాన్స్ ఇరగదీసేసిందని తెలుసుగా. మొత్తానికి ముగ్గురు టాప్ భామలు వరుసగా ఎటాక్ చేసేస్తుండడం విశేషం.