పొద్దునే పూచిన అందాల జాబిలి

0Kajal-Agarwal-Shares-her-Glamourous-Picఇప్పుడు వస్తున్న చాలా మంది హిరోయిన్స్ కు సోషల్ మీడియా ద్వారా తమ ఫాన్స్ కు ఎలా దగ్గర కావాలో పేజ్ 3 లో ఎలా కనిపించి హాట్ టాపిక్ గా ఎలా మారాలో బాగా తెలుసు. షూటింగ్ కోసం ఎక్కడకు వెళ్ళిన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తో తమ స్టేటస్ ను అభిమానులుకు చెప్పుతూ వాళ్ళ వర్క్ ని సంతోషాన్ని సోషల్ మీడియా మాధ్యమం ద్వారా పంచుకుంటున్నారు. చూడండి అదే పనిలో బిజీగా ఉంది కాజల్.

ఇప్పుడు యూరోప్ దేశాలలో తన సినిమా షూటింగ్ లో బాగా బిజీగా ఉంది చందమామ. చల్లిని కొండలు మధ్య చక్కగా పాటలు పాడుతుంది. పాట మధ్యలో ఇలా ఫోటోలుకు ఫోజ్ ఇచ్చింది తమ అభిమానులు కోసం. మండు వేసవిలో విరిసిన బొండు మల్లె ల మెరుస్తున్న చందమామలా ఉంది కదూ ఇక్కడ కాజల్. బ్ల్యూ షర్ట్ డెనిమ్ షార్ట్స్ తో సూపర్ కూల్ గా నిలబడింది. సాయంకాలంలో ప్రియుడు రాక కోసమొ రాత్రి వచ్చే జాబిలి కోసమో ఎదురుచూస్తునట్లు ఉంది కదూ. ఇలా ఒక అమ్మాయి నిజంగానే డేట్ కోసం ఎదురుచూస్తే ఆ ప్రియుడు ఎంత అదృష్టవంతుడో కదా.

కాజల్ అగర్వాల్ ఇప్పుడు తమిళ్ సూపర్ స్టార్స్ విజయ్ అజీత్ సినిమాలతో బిజీ గా ఉంది. మొన్ననే అజీత్ షూట్ ముగించుకొని ఇప్పుడు విజయ్ సినిమా పాటల షూటింగ్ కోసం పోలాండ్ లో పరువాలు అరబోస్తుంది. తెలుగులో పెద్ద హిట్ సినిమాలు లేక పోయినా తమిళ్లో ఇప్పుడు చేస్తున్న వాటితో మళ్ళీ సక్సెస్ కొట్టాలని ప్రయత్నిస్తోంది. అది సంగతి.