రక్తదానంపై హీరోయిన్‌ కాజల్‌ షార్ట్‌ఫిల్మ్‌

0పలు భాషల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న కాజల్‌.. తన వంతు బాధ్యతగా సామాజిక సేవకు నడుంబిగించారు. రక్త దానంపై అవగాహన కల్గించేందుకు ఆమె ఓ షార్ట్‌ ఫిల్మ్‌లో నటించారు. కాజల్‌ నటించిన షార్ట్‌ ఫిల్మ్‌ సోమవారం విడుదలైంది. కాబోయే వరుడిని ఎన్నుకునే క్రమంలో సాగే ఈ షార్ట్‌ మూవీకి శత్రుఘ్ఞ సిన్హా దర్శకత్వం వహించారు.