కాలా కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

0సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కాలా. పా.రంజిత్‌ దర్శకుడు. ధనుష్‌ నిర్మాత. రజనీకాంత్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా కాలా’ సినిమా విడుదలను నిలిపివేయాల్సిందిగా కేఎస్‌ రాజశేఖరన్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు తాను రాసుకున్న కథ నుంచి కాపీ కొట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని సినిమాను ఆపడం కుదరదని తీర్పు వెలువరించింది.