మెగా అల్లుడి ఏడుపు నచ్చిందట!!

0“విన్నప్పుడు ఈ మాట ఫన్నీగా అనిపించింది కానీ.. ఆ తర్వాత మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది“ అంటూ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ తన ఏడుపు విషయంలో వచ్చిన ప్రశంసలపై ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అదే విషయాన్ని సక్సెస్ మీట్ లోనూ చెప్పాడు. కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా పరిచయమైన విజేత ఈమధ్యే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో కళ్యాణ్ రీజనబుల్ గా నటించాడనే ప్రశంసలొచ్చాయి. ముఖ్యంగా ఏడుపు సన్నివేశాల్లో బాగా నటించావని అంతా మెచ్చుకున్నారట. ఆ విషయాన్ని సక్సెస్ మీట్ లో గుర్తు చేస్తూ “మామూలుగా ఎమోషన్స్ పలికించడం చాలా కష్టం అంటుంటారు. కానీ నాకు ఆ విషయంలోనే మంచి పేరొచ్చింది. అంతకంటే ఏం కావాలి?“ అని చెప్పుకొచ్చాడు కళ్యాణ్ దేవ్.

అల్లు అర్జున్ కూడా ఆ సన్నివేశాల్ని గుర్తు చేస్తూ మెచ్చుకొన్నారు కళ్యాణ్ ని. మొదట తన నటననే అబ్జర్వ్ చేశాననీ – ఆ తర్వాత మాత్రం తనని మరిచిపోయి పాత్రని చూశానని చెప్పుకొచ్చాడు. మొత్తంగా విజేత విషయంలో మెగా అల్లుడు కళ్యాణ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. రెండో సినిమా గురించి ప్లాన్ చేసుకుంటున్నాడు.