చిన్నల్లుడి కోసం పవన్ వస్తే పోయేది..

0చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా లాంచ్ అయ్యారు. విజేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కళ్యాణ్ దేవ్ కు సపోర్టుగా మెగా ఫ్యామిలీ మొత్తం కదిలింది. రాంచరణ్ ఉపాసన ట్వీట్స్ చేసి మద్దతుగా నిలిచారు. అల్లు అర్జున్ తాజాగా సక్సెస్ మీట్ కు వచ్చి భరోనిచ్చాడు. చిరంజీవి అయితే మొదటినుంచి అల్లుడి సినిమాకు వెన్నుదన్నుగా ఉన్నారు. కానీ ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై స్పందించలేదు. కళ్యాణ్ దేవ్ అడగలేదా.? లేక పవన్ బిజీగా ఉన్నారా తెలియదు కానీ ఈ పరిణామం మాత్రం ఆసక్తి రేపుతోంది..

‘విజేత’ మూవీ ప్రమోషన్ కోసం ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ నెల్లూరు జిల్లాకు వెళ్లారు. అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తి కర కామెంట్స్ చేశారు. ‘పవన్ తమ సినిమాకు ప్రమోషన్ ఇవ్వకపోయినా ఆయన ఆశీస్సులు మాకున్నాయంటూ’ కళ్యాణ్ దేవ్ కవర్ చేశారు. పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారని.. మేము వెళ్లి సినిమా విషయం చెప్పి డిస్టబ్ చేయడం ఇష్టంలేకే కలువలేదని తాజాగా వివరణ ఇచ్చాడు.

అయితే కళ్యాణ్ దేవ్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీగా లేరు. ఇటీవలే ఓ సినిమా పాటను కూడా తన చేతుల మీదుగా లాంచ్ చేశారు. తన పొలిటికల్ యాత్రకు విరామం ఇచ్చి హైదరాబాద్ లోనే ఖాళీగా ఉన్నారు. ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. పవన్ కళ్యాణ్ వస్తే ‘విజేత’ ప్రమోషన్ పరిపూర్ణం అయ్యేది. కానీ చిన్నమామను పిలవకుండా కళ్యాణ్ దేవ్ కవర్ చేశారా అన్న ప్రశ్న ఫిలింనగర్ వినిపిస్తోంది.