విజేత ట్రైలర్ టాక్: చిన్నల్లుడు మెప్పించాడు

0మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో లాంచింగ్ కు సిద్ధమయ్యాడు. చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చిరు ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో వారాహి చలనచిత్రం లాంటి పేరున్న బ్యానర్ అతడిని హీరోగా పరిచయం చేసేందుకు సిద్ధమైంది. చిరు సూపర్ హిట్ మూవీ విజేత టైటిల్ ను కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాకు పెట్టి ఫ్యాన్స్ ఈజీగా కనెక్టయ్యేలా ప్రయత్నించారు. త్వరలో రిలీజ్ కానున్న విజేత థియేటరికల్ ట్రయిలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

విజేత సినిమాలో కళ్యాణ్ దేవ్ ఓ మిడిల్ క్లాస్ యంగ్ స్టర్ పాత్ర చేశాడు. ఉద్యోగం తెచ్చుకోవడానికి నానా తంటాలు ఇంట్లో నాన్న దగ్గర మాటలు పడే ఓ మామూలు కుర్రాడిగానే కనిపించనున్నాడు. మనవల్ల మరొకరి ఫేస్ లో చిన్న స్మైల్ తీసుకొచ్చినా అది మన సక్సెస్సే అనే స్టార్టింగ్ డైలాగుతో ట్రయిలర్ స్టార్టవుతుంది. ట్రయిలర్ మొత్తం కుర్రాళ్ల సరదాలు.. మధ్యలో అందమైన అమ్మాయి కనిపిస్తే ఆమెను ఇంప్రెస్ చేయడానికి పాట్లు.. చివరిలో గుండె బరువెక్కించే తండ్రి కొడుకుల ఎమోషన్ తో చాలా ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు. మొత్తంమీద ట్రయిలర్ వరకు చూసుకుంటే చిన్నల్లుడు మెప్పించాడనే అనిపిస్తుంది.

ఈ సినిమాలో డైలాలుగు కూడా కాస్త ఇంప్రెసివ్ గానే ఉన్నాయి. ‘‘బుద్ధుడు కూడా ఇల్లొదిలి కూడా పోయాకే గొప్పోడయ్యాడు’’.. ‘‘మీలో ఎక్కువ మార్కులు చాలా తక్కువమంది ఉంటారు.. నాలా తక్కువ మార్కులు తెచ్చుకున్నాళ్లే ఎక్కువమంది ఉంటారు’’ వంటి డైలాగులు మిడిల్ క్లాస్ ఆడియన్స్ కు ఈజీగా కనెక్టవుతాయి. రాకేష్ శశి డైరెక్షన్ చేసిన ఈ మూవీలో కళ్యాణ వైభోగమే ఫేం మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది.