నందమూరి అల్లు హీరోల క్లాష్ సేఫేనా

0

సంక్రాంతి సినిమాల హడావిడి దాదాపుగా ఎండింగ్ కు చేరుకుంది. ఎఫ్2 తప్ప మిగిలిన మూడు ఫైనల్ స్టేజికి వచ్చేసాయి. ఇంకో రెండు వారాలు పైనే ఎఫ్2కి గ్యారెంటీ రన్ ఉండటంతో అర్ధ శతదినోత్సవం ఖాయమైపోయింది. ఇదలా ఉంచితే జనవరి 25న వచ్చిన మిస్టర్ మజ్ను తర్వాత ఇంకే చెప్పుకోదగ్గ సినిమాలు మార్కెట్ లో లేవు. ఉన్నంతలో మమ్ముట్టి యాత్ర కొంత ఆసక్తి రేపుతోంది తప్పించి ఫిబ్రవరి మొత్తం చాలా డ్రై గా సాగనుంది. సాధారణంగా ఈ నెలను మేకర్స్ అంతగా ఇష్టపడరు.

ఇక మార్చి నుంచి మళ్ళి కొత్త సినిమాల సందడి మొదలుకానుంది. అయితే మొదటి రోజే నందమూరి అల్లు హీరోలు క్లాష్ కు రెడీ కావడం ఆసక్తి రేపుతున్న విషయం. కళ్యాణ్ రామ్ కెరీర్ లో మొదటిసారి అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్ గా నటిస్తున్న 118 ఇప్పటికే టీజర్ ద్వారా హైప్ తెచ్చేసుకుంది. నివేదా థామస్ శాలిని పాండే హీరొయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ మీద అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అల్లు శిరీష్ ఎబిసిడి కూడా అదే డేట్ ఫిక్స్ చేసుకుంది. ఒక్క క్షణం తర్వాత ఏడాది రెండు నెలల గ్యాప్ తో వస్తున్నాడు శిరీష్.

బ్లాక్ బస్టర్ రీమేక్ కాబట్టి యూనిట్ కూడా ధీమాగానే ఉంది. దానికి తోడు ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది. తనకు సూట్ అయ్యే కథను ఎంచుకున్నాడని శిరీష్ కు కాంప్లిమెంట్స్ వచ్చాయి. అటు ఇటు గా కళ్యాణ్ రామ్ శిరీష్ లు ఒకే రేంజ్ మార్కెట్ ఉన్న వాళ్ళే కాబట్టి ఏది బాగుందనే దాన్ని బట్టి ఎక్కువ వసూళ్లు రావడం ఆధారపడి ఉంటుంది. జనవరి బాబాయ్ బాలకృష్ణ తో చరణ్ పోటీ పడితే ఇప్పుడు అబ్బాయి కళ్యాణ్ రామ్ శిరీష్ తో వార్ చేయబోతున్నాడు.
Please Read Disclaimer