మిల్కీ బ్యూటీతో కళ్యాణ్ రామ్ రొమాన్స్

0Kalyan-Ram-Picks-Tamannaపటాస్ సినిమాతో అద్భుతమైన హిట్ లభించినా ఆ తర్వాత హీరో కళ్యాణ్ రామ్ కు ఎదురుదెబ్బలే తగిలాయి. లుక్ మార్చి.. స్టయిల్ మార్చి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన ఇజం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో కొద్దిగా గ్యాప్ తీసుకుని తన తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ సినిమా ప్రొడ్యూసర్ గా బిజీ అయ్యాడు. ఆ సినిమా పనులు చూసుకుంటూనే రెండు కొత్త సినిమాల్లో హీరోగా నటించడానికి పచ్చజెండా ఊపాడు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ డైరెక్షన్ లో ఎంఎల్ ఏ (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే సినిమాతోపాటు జయేంద్ర డైరెక్షన్ లో మరో మూవీ చేస్తున్నాడు. ఎంఎల్ ఏ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జయేంద్ర దర్శకత్వంలో వస్తున్న సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నాను హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారు. సాధారణంగా కళ్యాణ్ రామ్ సినిమాల్లో ఎక్కువమంది హీరోయిన్ లు కొత్తవాళ్లే. హరేరామ్ – జయీభవ సినిమాల్లో మాత్రమే అప్పటికే హీరోయిన్లుగా ఫామ్ లో ఉన్నవాళ్లను తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ స్ట్రాటజీ మార్చి టాప్ హీరోయిన్లతో సినిమా చేస్తున్నాడు. ముందు జయేంద్ర సినిమాలో కొత్త హీరోయిన్ నే అనుకున్నప్పటికీ మనసు మార్చుకుని చివరి నిమిషంలో తమన్నా వైపు మొగ్గుచూపారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ మూవీలో తమన్నా సెప్టెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ లో జాయినవుతుంది.

కమర్షియల్ సినిమాలకు ప్రేక్షకులను తీసుకొచ్చేలా చేయడంలో గ్లామర్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో ఇంతవరకు అంతగా దృష్టి పెట్టని కళ్యాణ్ రామ్ ఇప్పుడు స్ట్రాటజీ మార్చాడు. అందుకే రాబోయే సినిమాల్లో అందాల బొమ్మలనే హీరోయిన్లుగా ఏరికోరి తీసుకున్నాడు. ఈ స్ట్రాటజీ ఏ మేరకు ఉఫయోగపడుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ..