పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హలో హీరోయిన్

0‘హలో’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కల్యాణి ప్రియదర్శన్‌. ఆ సినిమాలో ఆమె లుక్స్, పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఆమె ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్‌ను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు వదంతులు వెలువడుతున్నాయి.

దీనిపై తాజాగా కల్యాణి ఓ ప్రముఖ మలయాళీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించంది.”మేమిద్దరం కలిసున్న ఓ ఫొటోను ప్రణవ్ చెల్లెలు విస్మయ నాకు పంపించింది. నేను వెంటనే దాన్ని మా తల్లిదండ్రులకు షేర్ చేశాను. ఆ తర్వాత మా అమ్మ దాన్ని సుచిత్ర ఆంటీకి (ప్రణవ్ తల్లి) చూపించింది. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాంటూ వచ్చిన ఆ వార్త చూసి మా అమ్మ, ప్రణవ్ అమ్మ ఒక రోజంతా నవ్వుకున్నారు’ అని క్లారిటీ ఇచ్చింది కళ్యాణి.