రానాపై నోరు పారేసుకున్న బాలీవుడ్ క్రిటిక్

0Rana-Baahubali-2బాహుబలి 2 సినిమాకు ప్రపంచమంతా బ్రహ్మరథం పడుతుంటే కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు మాత్రం ఆ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్ లో చిన్న సినిమాల విషయంలో కూడా స్పందించే కొంత మంది స్టార్స్, ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన బాహుబలి 2పై స్పందించకపోవటం పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే తనకు తాను క్రిటిక్ అని చెప్పుకునే ఓ కమాల్ ఆర్ ఖాన్ మరో అడుగు ముందుకేసి బాహుబలి 2 యూనిట్ సభ్యులపై విమర్శలకు దిగుతున్నాడు.

రానా ట్విట్టర్ పేజ్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కమాల్ ఆర్ ఖాన్. ‘నేను ఈ ఇడియట్ ని ఎప్పుడు ఫాలో అవులేదు. ఈ రోజు వరకు అతని గురించి ట్వీట్ కూడా చేయలేదు. అయినా తను మెదడు లేని వాడిగా ప్రూవ్ చేసుకునేందుకు నన్ను బ్లాక్ చేశాడు’ అంటూ ట్వీట్ చేశాడు. కమాల్ ట్వీట్ పై జాతీయ మీడియాలో వార్తలు రావడంతో రానా స్పందించాడు. ‘ఆ మొరటు వ్యక్తిని ఏడాది కిందటే బ్లాక్ చేశాను’ అంటూ రిప్లై ఇచ్చాడు రానా. మరి రానా స్పందన పై కేఆర్ కే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.