రెహ్మాన్ని తప్పించి శంకర్ తెలివైన పని చేశాడా.?

0

ఇండియన్-2 (భారతీయుడు సీక్వెల్) ఈరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. ఓపెనింగ్ షాట్ కు సేనాపతి క్యారెక్టర్ లో వచ్చి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు కమల్ హాసన్. ముద్దుగుమ్మ కాజల్ కూడా ఈ ఓపెనింగ్ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లి కమల్ పక్కన నిల్చొని ఫొటోలకు పోజులిచ్చింది. అంతా బాగానే ఉంది కానీ ఓ కీలకమైన విషయం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇండియన్-2 సినిమాకు అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఇందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే భారతీయుడు సినిమాకు సంగీతం అందించిన రెహ్మాన్ ను కాదని – అనిరుధ్ కు అవకాశం ఇవ్వడంతోనే చిక్కంతా వచ్చింది. మరి శంకర్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా?

ఈ విషయంలో శంకర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అంటున్నారు విశ్లేషకులు. ఏఆర్ రెహ్మాన్ ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడే కావొచ్చు. కానీ అతడి సంగీతం ఈమధ్య కాలంలో అతడి సంగీతం ఆకట్టుకున్న దాఖలాల్లేవ్. రీసెంట్ గా వచ్చిన 2.O సినిమా దీనికి మరో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. మరోవైపు అనిరుధ్ దూసుకుపోతున్నాడు. మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొడుతున్నాడు. అందుకే ఆటోమేటిగ్గా అనిరుధ్ కే అవకాశం దక్కింది.
Please Read Disclaimer