స్పీల్ బర్గ్ లా ప్రమోట్ చేస్తున్నాడు!

0విశ్వనటుడు కమల్ హాసన్ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. ఎప్పుడో దాదాపు పదేళ్ల క్రితం రాసుకున్న స్క్రిప్టుల్ని ఆయన విశ్వరూపం సిరీస్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. విశ్వరూపం -1 సక్సెసైంది. విశ్వరూపం 2 ఆగస్టు 10న రిలీజవుతోంది. ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ప్రీక్వెల్ కం సీక్వెల్ తరహాలో ఉంటుందని కమల్ చెప్పాడు. ఇక ఈ సినిమా ప్రచారాన్ని కమల్ ఓ రేంజులో చేస్తున్నాడు.

మరో కోణంలో చూస్తే `విశ్వరూపం 2` ప్రమోషన్స్ కి కమల్ ఎంచుకున్న దారి ఎంతో కొత్తగా కనిపిస్తోంది. హాలీవుడ్ సినిమాల తరహాలో జనాకర్షణ ఎక్కువగా ఉన్న చోటల్లా `విశ్వరూపం2`ని ప్రమోట్ చేస్తున్నాడు. హిందీ ఆడియెన్స్ కి బాగా చేరువైన బిగ్ బాస్ (సల్మాన్ హోస్ట్)లో అతడు తన సినిమాని ప్రమోట్ చేశాడు. అలాగే తాను హోస్టింగ్ చేస్తున్న షోలోనూ ప్రమోట్ చేసుకుంటున్నాడు. అంతేనా.. ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో కొత్త స్టిల్స్ – వర్కింగ్ స్టిల్స్ – కొత్త టీజర్లు రిలీజ్ చేస్తూ వేడి పెంచేస్తున్నాడు. ఇటీవలి కాలంలో `జురాస్సిక్ వరల్డ్ -ఫాలెన్ కింగ్ డమ్` చిత్రాన్ని స్పీల్ బర్గ్ అండ్ టీమ్ ఎలా ప్రమోట్ చేశారో ఆ రేంజులో ప్రమోట్ చేస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ చేసిన పూర్తి స్థాయి ట్రైలర్ కి అద్భుత స్పందన వచ్చింది. మొన్నటికి మొన్న స్పై యాక్ట్ కు సంబంధించిన టీజర్ తో మెరుపులు మెరిపించాడు. తాజాగా బ్లూ సీలో భయానక పోరాట సన్నివేశాన్ని 10 సెకన్ల టీజర్ గా వదిలి ఉత్కంఠ పెంచాడు. సముద్రంలో శత్రువుతో ఫైట్ ఎలా ఉంటుందో ఈ టీజర్ లో చూపించాడు. ఇంకో 13రోజుల్లో థియేటర్లలోకి వచ్చేస్తున్నాం.. అంటూ తేదీని లైవ్ చేశాడు టీజర్ లో. మొత్తానికి కమల్ ప్రమోషనల్ స్ట్రాటజీ మైమరిపిస్తందనే చెప్పాలి.