విశ్వరూపం 2.. ఇక రిలీజ్ పక్కా..

0సినిమా రిలీజ్ విషయంలో ప్రస్తుతం బడా సినిమాలు చాలా వరకు హ్యాండ్ ఇస్తున్నాయి. రిలీజ్ అయ్యే వరకు ఆ సినిమా మీద నమ్మకం పెట్టుకోవడం కష్టంగా ఉంది. చివర్లో వాయిదాలు వేస్తున్న సందర్భాలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. ఎక్కువగా చిన్న సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కానీ బడా సినిమాలు కూడా చెప్పిన సమయానికి రావడం లేదు. గత కొంత కాలంగా కమల్ హాసన్ సినిమా విశ్వరూపం 2 కూడా రావాలా ? వద్దా? అనే స్టేజ్ లో సాగుతూ వస్తోంది.

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కథానాయకుడు కమల్ హాసన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కమల్ తో ఆస్కార్ రవిచంద్రన్ కూడా సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఫైనల్ గా సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ టెర్రరిజం కాన్సెప్ట్ తో కమల్ హాసన్ తెరకెక్కించిన విశ్వరూపం 2 ఇండిపెండెన్స్ సందర్భంగా ఆగస్ట్ 10న రానుంది. కమల్ హాసన్ అన్ని పనులు ఈ కొలిక్కి వచ్చిన తరువాతే ఆ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. యూఎస్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేస్తున్నట్లు సమాచారం.

అలాగే రిలీజ్ సమయం కూడా సినిమా కలిసొస్తుందని ఇండిపెండెన్స్ మూమెంట్ లో కమల్ సినిమాను వదులుతున్నాడు. మరి ఈ సినిమా ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి. కమల్ హాసన్ తో పాటు ఈ సినిమాలో పూజ కుమార్ – ఆండ్రియా అలాగే రాహుల్ బోస్ ప్రధాన పాత్రల్లో నటించారు. బాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన రోహిత్ శెట్టి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ పై హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.