రాజమౌళికి కమల్‌ ఆర్‌ ఖాన్‌ క్షమాపణలు

0Baahubali-2-and-Kamaal-R-Khanఎదో కారణం చేత బాహుబలి2 చిత్రంపై పనిగట్టుకొని విమర్శలు చేసిన వారికి ఇప్పుడిప్పుడే రాజమౌళి సత్తా తెలుస్తున్నది. బాహుబలి2 సినిమా చెత్త అంటూ సోషల్ మీడియాలో ధ్వజమెత్తిన బాలీవుడ్ నటుడు, నిర్మాత, విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ తన తప్పు తెలుసుకొన్నాడు. బాహుబలి2పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటూ రాజమౌళికి సారీ చెప్పడం గమనార్హం. కమల్ ఆర్ ఖాన్ అసలు రాజమౌళి, ప్రభాస్ గురించి ఏమన్నారంటే..

బాహుబలి‌2లో అసలు కథే లేదు. రాజమౌళి ఒక చూతియా డైరెక్టర్. దర్శకత్వం అస్సలు బాగాలేదు. సంగీతం గురించి అసలు మాట్లాడక్కర్లేదు. వినోదం పాళ్లు తక్కువ. ఎమోషన్‌ లేదు. వీఎఫ్‌ఎక్స్‌ గ్రాఫిక్స్‌ ఘోరం. థియేటర్లో ఉన్న ప్రేక్షకులను చాలా డిస్టర్బ్‌ చేస్తుంది. రియాల్టీకి దగ్గరగా లేదు. వాస్తవానికి వేలమైళ్ల దూరంలోఉంది. సంగీతం హిందీ ప్రేక్షకులకు అస్పలు నచ్చదు అని కమల్‌ ఆర్‌ ఖాన్‌ బాహుబలిపై ధ్వజమెత్తారు.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ను ఎవరైనా తీసుకోవాలంటే ఓ సారి ఆలోచించుకోవాలి. ప్రభాస్ ఒంటెలా ఉంటాడు. ఒకవేళ ఎవరైనా తీసుకొంటే వాళ్లు పెద్ద ఇడియెట్స్ అవుతారు అని బాహుబలి2 విడుదలైన తర్వా కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బాహుబలి ప్రభంజనం చూసిన తర్వాత కమల్ ఆర్ ఖాన్ చెంపలేసుకొని ఏమన్నారంటే..

బాహుబలి2 సినిమాను తప్పుగా సమీక్షించినపుడు వెరీ వెరీ సారీ. నాకు నచ్చలేదు కానీ ప్రజలకు నచ్చింది. ప్రజా తీర్పే శిరోధార్యం. సారీ రాజమౌళి అంటూ కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశారు.

ఇక నుంచి బాహుబలి2 సినిమా కాదు. అదో ఉద్యమం. దానిలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలనుకొంటున్నారు. బాహుబలి2 సృష్టించిన ప్రభంజనం మరో 30 ఏళ్ల వరకు సాధ్యపడదు అని మరో ట్వీట్‌లో కేఆర్కే పేర్కొన్నారు.

బాహుబలి2 హిందీ వెర్షన్ విడుదలైన మూడో శనివారం రోజున కూడా రూ.20 కోట్లు సంపాదించింది. వ్యాపారపరంగా ఇది సామన్యమైన విషయం కాదు. రాజమౌళికి దేవుడి దీవెనలు ఉన్నాయి అని మరో కమల్ ట్వీట్ చేశారు.