జెర్సీకి కాంచన గండం

0

న్యాచురల్ స్టార్ నాని జెర్సీ వచ్చే నెల 19న విడుదలకు రెడీ అవుతోంది. ముందు 5 అనుకున్నా నాగ చైతన్య మజిలీతో పాటు ఆ పై వారం సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి ఉండటంతో ఫైనల్ గా అనుకూలమైన తేదీని ఎంచుకుంది. నిజానికి ఆ రోజు ఏ పోటీ లేదు. బాలీవుడ్ మల్టీ స్టారర్ కళంక్ ని షెడ్యూల్ చేశారు కానీ మొన్న ట్రైలర్ విడుదల రోజు అనూహ్యంగా దాన్ని రెండు రోజులు ముందుకు జరిపి 17 ఫిక్స్ చేశారు. సో దీని రిజల్ట్ పూర్తిగా తెలిసిపోతుంది కాబట్టి ఏ సెంటర్స్ లో వచ్చిన ఇబ్బందేమీ లేదు.

అయితే మరో రూపంలో జెర్సికి పోటీ తప్పేలా లేదు. అదే కాంచన 3. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మీద కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. దీన్ని ఏప్రిల్ 19న తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవేళ ఇది కన్ ఫర్మ్ అయితే ఖచ్చితంగా తెలుగు వెర్షన్ కూడా అదే తేదీకి తీసుకువస్తారు. లేట్ చేస్తే ఎలాంటి ఫలితాలు అందుతాయో విశ్వాసం-అంజలి సిబిఐ లాంటి సినిమాలు నిరూపించాయి కాబట్టి లారెన్స్ అనవసరమైన రిస్క్ తీసుకోడు.

కాంచన 3 కూడా హారర్ జానర్ అయినప్పటికీ లారెన్స్ ఈసారి పాముల బ్యాక్ డ్రాప్ తో పాటు వృద్ధ గెటప్ వేసి ఏదో కొత్తగా ట్రై చేశాడు. సో రెగ్యులర్ గా ఉండదన్న అంచనా అయితే ఉంది. సో జెర్సి అప్పుడు కాంచన 3తో ఢీ కొట్టాల్సి ఉంటుంది. లారెన్స్ ఇప్పటిదాకా చేసిన ముని-కాంచన-గంగ ఏది ఫెయిల్ కాలేదు. అందుకే ఇప్పుడీ సీక్వెల్ కు మంచి బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. విచిత్రంగా చిత్రలహరికి తమన్నా దేవి2 తో పోటీ ఉంటె ఇప్పుడు జెర్సికి కాంచన 3తో ఫైట్ పడేలా ఉంది. మరికొద్ది రోజుల్లో ప్రకటన వచ్చాక క్లారిటీ వస్తుంది
Please Read Disclaimer