ప్రభాస్ హీరోయిన్ బర్త్‌ డే కి బంగ్లా గిఫ్ట్‌ !

0kangana-ranaut-spicyబాలీవుడ్‌లో విలక్షణ నటిగా, ఫైర్‌బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న హీరోయిన్‌ కంగనా రనౌత్‌. ఆమె ఇటీవల 30వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తనకు తాను ఒక రాయల్‌ కానుక ఇచ్చుకుంది. ముంబైలోని విలాసవంతమైన ప్రాంతంలో ఒక విస్తారమైన మూడంతస్తుల భవంతిని ఆమె సొంతం చేసుకుంది. ఈ భవనంలో తన కార్యాలయం ఏర్పరుచుకోవాలని, ఇందులోనే తాను మొదటిసారిగా దర్శకత్వం వహించబోతున్న సినిమాను ప్రారంభించాలని కంగన భావిస్తున్నట్టు సమాచారం.

‘ఇది చాలా విశాలమైన మూడంతస్తుల భవనం. తనకు విశాలమైన కార్యాలయం ఉండాలని, అందులోనే తన దర్శకత్వ సినిమాను ప్రారంభించాలని కంగన కలలు కనేది. ఈ ఏడాదే ఆమె తన దర్శకత్వంలో సినిమాను తెరకెక్కించబోతున్నది. త్వరలో నిర్మాతగా కూడా మారబోతున్నది’ అని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ‘మిడ్‌ డే’ పత్రిక పేర్కొన్నది. తాజాగా ‘రంగూన్‌’ సినిమాతో అలరించిన కంగన త్వరలో హన్సల్‌ మెహతా ‘సిమ్రన్‌’ చిత్రంతో పలుకరించబోతున్నది. ప్రముఖ తెలుగు దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో రాణీ లక్ష్మీభాయ్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’ చిత్రంలోనూ ఆమె నటించబోతున్నది.