నా భర్తతో డేటింగ్ చేసింది.. కూతురని ఎలా అనుకోను?

0Kangana-Ranaut-dated-My-Husbandబాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం ఇంకా చల్లారట్లేదు. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య పంచోలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. పంచోలి తనను తీవ్రంగా హింసించారని, కూతురు కంటే చిన్న వయసున్న తనను రక్తం వచ్చేలా హింసించారని ఆరోపించింది. దీంతో తాను ఆదిత్య భార్య జరీనా హెల్ప్ కోసం వెళ్లానని.. ఆమె కూడా సహకరించలేదని తెలిపింది. ఈ ఆరోపణలపై జరీనా స్పందించారు. కంగనా తన భర్త ఆదిత్య పంచోలీతో నాలుగున్నర సంవత్సరాలు డేటింగ్ చేసిందని.. అలాంటపుడు ఆమెను కూతురుగా ఎలా ట్రీట్ చేస్తామని ప్రశ్నించింది. తన అప్ కమింగ్ మూవీ సిమ్రన్ పబ్లిసిటీ కోసమే కంగనా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని జరీనా విమర్శించారు. అయినా ఎప్పుడో జరిగినట్టు చెబుతున్న విషయాలను ఇప్పుడు తెరపైకి తీసుకురావడమేంటని జరీనా ప్రశ్నిస్తున్నారు.