అఫిషియల్.. ‘తలైవి’గా మణికర్ణిక

0

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ సీనియర్ హీరోయిన్ అయిన జయలలిత బయోపిక్ తీసేందుకు తమిళ ప్రముఖ దర్శకుడు విజయ్ 9 నెలలుగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. జయలలిత బయోపిక్ పేరుతో ఎన్నో సినిమాలు మొదలైనా కూడా విజయ్ తీయబోతున్న బయోపిక్ పైనే ఎక్కువ మంది దృష్టి ఉంది. జయలలిత అధికారిక బయోపిక్ విజయ్ తీయబోతున్న ‘తలైవి’నే అంటూ అంతా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన విజయ్ త్వరలోనే సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఇక తలైవి సినిమాలో అమ్మ పాత్రను ఎవరు పోషిస్తారు అనే చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు.

‘తలైవి’ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను జీవీ ప్రకాష్ చేశాడు. నేడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమె ‘తలైవి’గా నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. చాలా కాలం తర్వాత కంగనా మళ్లీ ఈ చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో నటించబోతుందని ఆయన పేర్కొన్నాడు. కంగనా లీడ్ రోల్ లో విబ్రి మీడియా మరియు విష్ణు ఇందూరి లు నిర్మించబోతున్న ఈ చిత్రంకు విజయ్ దర్శకత్వం వహించబోతున్నాడని చెప్పడంతో పాటు విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రంకు రచన సహకారం అందించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

మణికర్ణిక చిత్రం తర్వాత కంగనా తన సొంత బయోపిక్ ను తీయాలని భావించింది. స్వీయ దర్శకత్వంలో తన బయోపిక్ ను మొదలు పెట్టాలనుకున్న ఆమెకు ఈ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ‘తలైవి’ సినిమాలో కంగనా ఎంట్రీతో సినిమా స్థాయి రెట్టింపు అయ్యిందని భావిస్తున్నారు. తలైవికి బాలీవుడ్ లో కూడా మంచి పరిధి పెరగడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే సినిమాలో కంగనా ఇన్వాల్వ్ మెంట్ గురించి కామెంట్స్ వినిపిస్తున్నాయి. మణికర్ణిక తరహాలో ఈ సినిమాలో కూడా వేలు పెడితే పరిస్థితి ఏంటీ అంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారు.
Please Read Disclaimer