ఆదియోగి ఆశ్రమంలో `మణి కర్ణిక`

0బాలీవుడ్ హీరోయిన్లలో కంగనా రనౌత్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన అభినయంతో పాటు ప్రేక్షకులతోపాటు విమర్శకులను కూడా ఆకట్టుకున్న ఈ `క్వీన్`…..ముక్కుసూటిగా మాట్లాడి నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. హృతిక్ తో వివాదం సద్దుమణిగిన తర్వాత….మణికర్ణిక షూటింగ్ లో బిజీ అయింది కంగనా. ఆ చిత్ర షూటింగ్ మధ్యలో లభించిన విరామాన్ని కంగనా ఎంజాయ్ చేస్తోంది. అయితే మిగతావారిలా పార్టీలకు పబ్ లకు వెళ్లకుండా……‘ఆధ్యాత్మిక ప్రపంచం’లో సేద తీరుతోంది. రంగుల ప్రపంచానికి దూరంగా వచ్చిన కంగనా….ధ్యాన ప్రపంచంలో సమయం గడుపుతోంది. తమిళనాడులోని సుప్రసిద్ధ ఆదియోగి ఆశ్రమాన్ని సందర్శించిన కంగనా….అక్కడి ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం ‘ మణికర్ణిక ‘ చిత్రం షూటింగ్ కోయంబత్తూరులో జరుగుతోంది. అయితే షూటింగ్ కు కొద్దిగా విరామం దొరకడంతో కంగనా….అక్కడి సుప్రసిద్ధ ఆదియోగి ఆశ్రమాన్ని సందర్శించింది. ధ్యానలింగం వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసిన కంగనా….ఆ ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించింది. దాంతోపాటు అక్కడ ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న స్కూలుకు వెళ్లి చిన్నారులతో సరదాగా ఆడిపాడింది. ఆ ఫొటోలను చూసిన కంగనా అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆధ్యాత్మికతతో మనసుకు సాంత్వన చేకూరుతుందని కంగనాకు ఆ పరమ శివుడు మరింత మనోధైర్యాన్నిస్తాడని కామెంట్స్ పెడుతున్నారు. పసిపిల్లలవంటి నిష్కల్మషమైన మనసున్న కంగనా….పిల్లలతో మమేకమైందని ఆమె అభిమానులు సంతోషపడుతున్నారు.