కంగనా కామెంట్స్ నా దృష్టికి రాలేదు : అమీర్

0

చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసే బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ కొన్నాళ్ల క్రితం అమీర్ ఖాన్ పై కూడా ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం ప్రమోషన్స్ కోసం నేను అంబానీ ఇంటికి వెళ్లాను. ఆ సినిమా గురించి పలు సందర్బాల్లో మాట్లాడాను. కాని నా సినిమా గురించి ఆయన ఎప్పుడు మాట్లాడటం కాని నా సినిమా కోసం ఆయన ఎప్పుడు రావడం కాని చేయలేదని కంగనా వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారంను రేపాయి. వాటిపై అప్పుడు అమీర్ స్పందించలేదు. వాటిని ఇప్పుడు అమీర్ సరదాగా తీసుకున్నాడు.

నేడు అమీర్ ఖాన్ పుట్టిన రోజు సందర్బంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో మీడియాతో చిట్ చాట్ చేశాడు. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు అమీర్ సరదాగా సమాధానం ఇచ్చాడు. ఒక జర్నలిస్ట్ ఆమద్య కంగనా చేసిన వ్యాఖ్యల గురించి మీ కామెంట్ ఏంటీ అంటూ అమీర్ ను ప్రశ్నించగా… కంగనా అలా అన్న విషయం నాకు తెలియదు ఇలాంటి విషయం గురించి ఆమె నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కనుక ఎప్పుడైనా తను కలిస్తే దీని గురించి తప్పకుండా అడిగి తెలుసుకుంటాను అన్నాడు.

ఇక అమీర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ ఫ్లాప్ అయిన నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకుని తదుపరి చిత్రానికి సిద్దం అయ్యాడు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ ను రీమేక్ చేయబోతున్నట్లుగా అమీర్ ఖాన్ ప్రకటించాడు. రీమేక్ కు ‘లాల్ సింగ్ చద్దా’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. త్వరలోనే లాల్ సింగ్ చద్దా మూవీ గురించి పూర్తి వివరాలు వెళ్లడిస్తానంటూ ప్రకటించాడు.
Please Read Disclaimer