అలాంటి వాడికి ముద్దు పెట్టాలంటే కష్టమే

0Kangana-Kiss-Scenesబాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చేసే యాక్షన్ మాత్రమే కాదు.. ఆమె కామెంట్స్ కూడా భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. రియాలిటీ దగ్గర ఉండడం కాదు.. వాస్తవాలను కుండ బద్దలుకొట్టినట్లు ఏ మాత్రం మొహమాటపడకుండా ఆమె చెప్పే తీరు.. చాలా మందిని ఇబ్బంది పెడుతుంది కానీ.. అభిమానులను మాత్రం ఆకట్టుకుంటుంది.

తాజాగా రంగూన్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కంగనా.. షాహిద్ కపూర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. రొమాంటిక్ సీన్స్.. ముఖ్యంగా లిప్ టు లిప్ కిస్సింగ్ సీన్స్ చేసే విషయంలో బాగా ఇబ్బంది పడ్డానంటోంది కంగనా. ‘నీ మీసాలు ఎందుకు గుచ్చుకుంటున్నాయ్ అని షాహిద్ అని అడిగితే.. వాక్స్ అప్లై చేశానన్నాడు. అసలే మీసాలు గుచ్చుకుంటుంటే.. దీనికి తోడు షాహిద్ చీమిడి ముక్కు ఒకటి. ఆ చీమిడి ముక్కు కారణంగా షాహిద్ కి ముద్దు పెట్టే సన్నివేశాలు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను’ అని చెప్పింది కంగనా.

అయితే కొన్నిసార్లు ఫ్రెండ్లీగాను.. కొన్నిసార్లు మూడీగాను ఉండే షాహిద్.. ఓవరాల్ గా మాత్రం మంచోడని కితాబిచ్చింది. ఇక సైఫ్ ఆలీ ఖాన్ తో రొమాంటిక్ సీన్స్ చేసేందుకు ఏ మాత్రం ఇబ్బంది పడలేదని.. అతను చాలా ప్రొఫెషనల్ అని పొగిడేసింది కంగనా రనౌత్.