సెక్స్ కోసం తపించే ప్రభాస్ హీరోయిన్

0Kangana-Ranautబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ రూటే సపరేటు. ఏదో ఒక స్టార్ హీరో పక్కన డాన్సులు చేయడం, ఆయనగారి చుట్టూ తిరగడం, పాటకు ముందు ఓ సారి వచ్చి మళ్లీ పాటలోనే కనబడటం లాంటి పాత్రలు అస్సలు చేయదు కంగనా. ముద్దు సన్నివేశాలు చేయదని కాదు, చేస్తుంది కానీ కథలో అవసరమైతేనే. బికినీలో కనిపించను అని కాదు, కనిపిస్తుంది కానీ బికినీ వేసి పాత్ర అయితేనే. కొత్త కొత్త కథలతో, చాలెంజింగ్ పాత్రలతో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది కంగనా.

ఈ అసమాన నటి నటించిన కొత్త చిత్రం పేరు సిమ్రాన్. ఈ చిత్రాన్ని కూడా కంగనా తన భుజాల పైనే మోయనుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో శృంగారం కోసం అబ్బాయ వెంటపడే ఓ తుంటరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది కంగనా.

శృంగారం అనేది కేవలం అబ్బాయిలు ఆస్వాదించే క్రియ కాదు. శృంగారాన్ని అమ్మాయిలు కూడా అబ్బాయిలు ఆస్వాదించినట్లు ఆస్వాదించగలరు. అమ్మాయిలకు కూడా కామోద్రేకం వస్తుంది అమ్మాయిలకు కూడా కోరికలు ఉంటాయి. ఇందులో హీరోయిన్ భర్తతో విడాకులు తీసుకున్నాక శృంగారం దొరక్క అల్లాడిపోతుంటుంది. తాను శృంగారం కోసమే పుట్టింది. అందుకే ఎప్పటికప్పుడు అబ్బాయిలను మారుస్తూ వారితో డేటింగ్ చేస్తూ ఉంటుంది. ఈ పాత్రను ఎంతో ఇష్టపడి కష్టపడి పోషించానని కంగనా తెలిపింది.

హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఇదే నెల 15వ తేదీన విడుదల కానుంది. మరి శృంగారం కోసమే పుట్టిన సిమ్రాన్ నీ ప్రేక్షకులు అంతగా అర్థం చేసుకోని ఎలాంటి ఫలితం ఇస్తారో చూడాలి.