ఈసారి పాలిటిక్స్.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

0

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసి వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎవరు ఏం అనుకుంటారో అనే విషయంను ఆలోచించకుండా తాను అనుకున్న విషయాన్ని ఇష్టం వచ్చినట్లుగా ఆమె అనేస్తుంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ పై కూడా కామెంట్స్ చేసి విమర్శల పాలు అయిన కంగనా తాజాగా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించి హాట్ టాపిక్ అయ్యింది.

పార్లమెంట్ కు 4వ దశ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా ముంబయిలో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో కంగనా రనౌత్ ఒక్కరు. ఓటు వేసిన తర్వాత ఆమెను మీడియా చుట్టు ముట్టింది. ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ నాలుగు ముక్కలు మాట్లాడమని ఆమె ముందు మైక్ పెడితే రాజకీయాలు మాట్లాడింది.

ఈరోజు చాలా కీలకమైన రోజు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అయిదు సంవత్సరాల్లో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం ఇది. అందుకే దీన్ని ఎవరు కూడా వృదా చేసుకోవద్దు. ఇండియాలో ఇప్పుడే నిజమైన స్వాతంత్య్రం ఉంది. ఈ ప్రభుత్వం రావడానికి ముందు వరకు కూడా మొగలాయిలు బ్రిటీష్ వారు ఇటాలియన్ గవర్నమెంట్ ఉండేదని అప్పుడు దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. గత ప్రభుత్వాల హయాంలో ఎక్కడ చూసిన పేదరికం కాలుష్యం అత్యాచారాలు ఉండేవి. ఇప్పుడు మాత్రమే స్వరాజ్యం సాగుతుందని కంగనా పేర్కొంది. ఇది ఇలాగే కొనసాగాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని కంగనా పిలుపునిచ్చింది. కంగనా మాటలు చూస్తుంటే ఆమె భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ చర్చ జరుగుతోంది.
Please Read Disclaimer