అడ్డుకుంటే లేపెస్తా అంటున్న హీరొయిన్

0

వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మణికర్ణిక ఈ నెల 25న విడుదలవుతోంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిపోయాయి. దర్శకుడిగా క్రిష్ పేరు కూడా ఉన్నప్పటికీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కథను మొత్తం వక్రీకరించారని తనకు దాంతో సంబంధం లేదన్నట్టు మాట్లాడ్డంతో రేపు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా క్రెడిట్ కంగనాకే వెళ్తుంది. ఇక ఎప్పటిలాగే ఇలాంటి చారిత్రాత్మక సినిమాలకు వచ్చే బెదిరింపులు దీనికి కూడా వస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన కర్ణిసేన విడుదలకు ముందే తమకు చూపాలని లక్ష్మి బాయ్ కి ఓ బ్రిటిష్ ఆఫీసర్ కు ఇందులో ప్రేమాయణం చూపినట్టు అనుమానం ఉందని కాదంటే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారి చేసింది.

గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో దీపికా పదుకునే పద్మవత్ ఇంతకంటే చేదు అనుభవాలు ఎదురుకుంది. ఇప్పుడు మణికర్ణికకు అదే పరిస్థితి ఎదురవుతోంది. అయితే అప్పుడు సంజయ్ లీలా భన్సాలీ తరహాలో కంగనా వీటికి బెదిరిపోవడం లేదు. తానూ రాజ్ పుత్ వంశానికి చెందిన దాన్నేనని తన సినిమాను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే లేపేస్తానని గట్టి వార్నింగ్ ఇస్తోంది. అంతే కాదు విడుదలకు ఎవరైతే అడ్డం వస్తారో ప్రతి ఒక్కరి అంతు చూస్తానని ఘాటుగా బదులిస్తోంది. కంగనా మొండి ధైర్యం చూసి ఇండస్ట్రీ పెద్దలు కూడా షాక్ అవుతున్నారు.

సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాను మీరెలా అడ్డుకుంటారని రివర్స్ లో ప్రశ్నిస్తోంది. ఇప్పటికే కాస్టింగ్ ప్లస్ డైరెక్టర్ విషయంలో వివాదాలకు నిలయంగా మారిన మణికర్ణిక ఇప్పుడు ఈ కర్ణిసేనను ఎదురుకోవడం అంత ఈజీ కాదు. ఇంకో పది రోజులు కూడా లేని నేపథ్యంలో కంగనా ప్రమోషన్ ను చూసుకుంటూనే ఇలాంటి బెదిరింపులకు ధీటుగా బదులిస్తోంది.
Please Read Disclaimer