మరోసారి ఫిఫీలో బికిని

0

కన్నడ భామ సంయుక్త హెగ్డే తెలుసా? నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘కిరాక్ పార్టీ’ సినిమాలో హీరోయిన్. ఆ సినిమా హిట్ కాలేదు కానీ హిట్ అయి ఉంటే మాత్రం సంయుక్త పేరు అందరికీ తెలిసి ఉండేది.. ఆఫర్లు కూడా వెల్లువలాగా వచ్చి ఉండేవి. అలా జరగలేదని ఈ బెంగుళూరు భామ ఏమీ దిగులు పడలేదు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా కత్తిలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తూ తన సత్తా చాటుతోంది.

ఈమధ్య ఈ హాటు షోలు చేసే భామల వయసు.. ముప్ఫైలు.. నలభైల్లో ఉంటోంది. కానీ సంయుక్త వయసు మాత్రం జస్ట్ 20. అందుకేనేమో ఓల్డ్ జెనరేషన్ భామల స్టైల్ కు ఈ భామ స్టైల్ కు చాలా తేడా ఉంది. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “మీరు ఏది చూస్తారనేది మీగురించి తెలుపుతుంది అది నేను కాదు. అవును.. ఈ ఫోటో చాలా నైస్ గా ఉంది. క్రిస్ థ్యాంక్ యూ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీన్ని బట్టి పాప యాటిట్యూడ్ ఎలా ఉందో అర్థం అవుతుంది కదా. నెటిజనులు కాంప్లిమెంట్ ఇచ్చే ముందే ‘ఫోటో నైస్’ అని తనకు తాను కాంప్లిమెంట్ ఇచ్చుకుంది అంటే టన్నుల్లో కాన్ఫిడెన్స్ ఉన్నట్టేగా.

పింక్ కలర్ బికినీ.. చాకొలేట్ లా ఉన్న మేనిరంగు.. తీరైన ఒంపుసొంపులతో వయ్యారాన్ని ఒలకబోసే బాడీ లాంగ్వేజ్ తో నిలబడి ఓరగా నవ్వుతోంది. లొకేషన్ కూడా అదరహో.. పచ్చటి చెట్లు.. స్వచ్చంగా అడుగున నేల కనిపిస్తున్న నీటి వాగు.. ఆ పైన బోటు.. దానిపైన హాటు. ఇంతకీ ఈ భామ ఎక్కడ ఎంజాయ్ చేస్తోందో తెలుసా? ఫిఫీ ద్వీపంలో.. థాయ్ ల్యాండ్. గతంలో కూడా ఈ ఫిఫీ ద్వీపంలో ఎంజాయ్ చేసింది. పాపకు ఫిఫీ నచ్చినట్టుంది. అయితే నెటిజనులకు ఫిఫిలో ఉన్న పాప నచ్చింది. ఒకరు “ఇంత హాట్ గా ఎలా ఉన్నావు” అన్నారు. మరొకరు “బ్యూటిఫుల్ లాంగ్ లెగ్స్” అన్నారు. ఇంకొకరు “జూనియర్ సన్నీ లియోన్” అన్నారు. ఒక నెటిజనుడు మాత్రం కన్నడలో కవిత్వం రాశాడు. ఇదిలా ఉంటే సంయుక్త ప్రస్తుతం తమిళంలో యమా బిజీగా ఉంది. టోటల్ గా మూడు సినిమాల్లో నటిస్తోంది. అవి ‘పప్పీ’.. ‘తేల్’..’కోమలి’.
Please Read Disclaimer