కేజీఎఫ్ గాళ్.. బోలెడంత వేడి ఉంది!

0

కనిపించింది కొద్ది సేపే అయినా.. కిల్లింగ్ లుక్స్ తో కట్టి పడేసింది శ్రీనిధి శెట్టి. మిస్ బెంగళూరు పెద్ద తెరపై తడాఖా ఏంటో చూపించింది. కన్నడ ఇండస్ట్రీ నంబర్ 1 హిట్ చిత్రం కేజీఎఫ్ తో తెరంగేట్రం చేసినా ఈ భామకు ఎందుకనో ఒక్కసారిగా అంత పాపులారిటీ రాలేదు. కేజీఎఫ్ చిత్రంతో అటు హిందీ ఇటు తెలుగు తమిళం మలయాళం కన్నడ రంగాల్లో శ్రీనిధి శెట్టి పేరు మార్మోగిపోయినా వెంట వెంటనే భారీ ప్రాజెక్టులకు సంతకాలు చేసిందేమీ లేదు. అందుకు సంబంధించిన చప్పుడు కూడా వినిపించలేదు.

అదంతా సరే.. ఈ భామ ర్యాంప్ నుంచి సినీపరిశ్రమకు వచ్చింది కాబట్టి అందుకు తగ్గట్టే అదిరిపోయే ఫోటోషూట్లతోనూ విరుచుకుపడుతోంది. ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో శ్రీనిధి ఫోటోషూట్లను కుర్రకారు వెర్రెత్తిపోతున్నారు. అందం ఉంది.. వేడి ఉంది.. అందాల ఎలివేషన్ కి అభ్యంతరం లేదు. అయితే ఈ అమ్మడికి ఓ మైనస్ పాయింట్ కూడా ఉంది. దాదాపు ఆరున్నర అడుగుల ఎత్తు ఉండే ఈ భామకు ప్రభాస్ రానా లాంటి స్టార్లు తప్ప పొట్టిగా ఉండే హీరోలతో అయితే కష్టమే.

ముంబై బ్యూటీ పూజా హెగ్డేకి చుట్టంలా పొడుగుకాళ్ల దీపికకు కజిన్ లా అంత ఎత్తున ఉండే ఈ అందగత్తెకు మన స్టార్ హీరోలు వెల్ కం చెబుతారా లేదా? ఆ ఒడ్డు పొడవు చూసి కొంచెం ఇబ్బందేనని దూరం జరుగుతారా? అన్నది చూడాలి. ఇప్పటికైతే శ్రీనిధి సైలెంటుగానే ఉంది. మునుముందు అగ్ర హీరోల సినిమాలకు సంతకం చేస్తే ఆ తర్వాత పాపులారిటీ అమాంతం పెరుగుతుంది. చాలామంది అందాల పోటీల నుంచి వచ్చిన భామలతో పోలిస్తే ఈ బ్యూటీ కెరీర్ ఓ సంచలనంతో మొదలైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


Please Read Disclaimer