స్టార్‌ కమెడియన్‌ కు అస్వస్థత

0kapil-sharmaప్రముఖ బాలీవుడ్ నటుడు, కమెడియన్, టీవీ షో వ్యాఖ్యాత కపిల్ శర్మ అనారోగ్యానికి గురయ్యారు. స్వల్ప అనారోగ్యంతో బుధవారం ఆయన అంధేరిలోని ఒక ఆసుపత్రిలో చేరారు. లో బ్లడ్‌ ప్రెషర్‌ కారణగా అసౌకర్యానికి గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శర్మ కోలుకుంటున్నారనీ, ఆయన ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉందని బాలీవుడ్‌ మీడియా కథనం. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఎపుడు డిశ్చార్చ్‌ చేసేది ఇంకా ఆసుపత్రి వర్గాలు ప్రకటించలేదు.

అయితే నేడు జరగనున్న దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు పంక్షన్‌కు హాజరు లేకపోవచ్చని బాలీవుడ్‌.లైఫ్‌ తెలిపింది. ఈ గౌరవ పురస్కారానికి ఈ స్టార్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మ రెండవ సారి ఎంపిక య్యారు. ఒకవైపు కపిల్‌ షో, మరోవైపు బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ పనుల్లో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్టు పేర్కొంది.

కాగా కామెడీ నైట్స్ విత్ కపిల్ ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న కపిల్ శర్మ తాజాగా ది కపిల్‌ శర్మ షో కు వ్యాఖ్యాతగా ఉన్నారు. మరోవైపు ఫిరంగి మూవీ షూటింగ్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కపిల్‌ ఇటీవల కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.