కపూర్ ఇంట్లో పెళ్లి సందడి

0బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ గారాలపట్టి సోనమ్‌ కపూర్‌ పెళ్లి సందడి మొదలైంది. సోనమ్‌..దిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్‌ అహూజాతో కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. కాగా..మే మొదటి వారంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటి కానున్నారు.

దీంతో వివాహ వేడుకకు ముందు నిర్వహించే సంగీత్ కోసం సోనమ్‌ సిద్ధమవుతోంది. సంగీత్ లో సోనమ్ వేసే స్టెప్పులను ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ కంపోజ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా ఫరాతో కలిసి దిగిన ఫొటోలను సోనమ్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. జుహులోని అనిల్‌ కపూర్‌ బంగ్లాలో సంగీత్‌ రిహార్సల్స్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సోనమ్‌, ఆనంద్‌ కుటుంబీకులంతా హాజరుకాబోతున్నారు. పెళ్లి స్విట్జర్లాండ్‌ ప్లాన్ చేస్తున్నారని టాక్.