500కోట్ల బడ్జెట్ హిస్టారికల్ సినిమాలో జాన్వీ?

0నిన్నగాక మొన్న ధడక్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది జాన్వీ. అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా బరిలో దిగింది. ఆరంగేట్రమే బ్లాక్ బస్టర్ జాన్వీ నటించిన ధడక్ బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెసైంది. డెబ్యూ నాయికగా తనకు ఇది సక్సెస్ ఫుల్ ఎంట్రీ. ఇలా హిట్టందుకుందో లేదో అలా 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హిస్టారికల్ సినిమాలో జాన్వీ జాక్ పాట్ పట్టేసింది. ఈ సినిమాని కూడా ధడక్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

ఇదో అసాధారణ మల్టీస్టారర్ సినిమా. టైటిల్ `తక్త్`. `వక్త్` లాగా వెరైటీగా ఉన్నా.. ఇదో చారిత్రక నేపథ్యం ఉన్న వారియర్ సినిమా అని అర్థమవుతోంది. తక్త్ అంటే అర్థం బెంచ్ లేదా సీట్ లేదా సింహాసనం అని అర్థం. అంటే కుర్చీ కోసం లేదా సింహాసనం కోసం పోరాడే వారియర్ సినిమా ఇది అని అర్థం చేసుకోవచ్చు. ఇందులో పద్మావత్ ఫేం ఖిల్జీ పాత్రధారి రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. అతడి సరసన కిల్లింగ్ లేడీస్ కరీనాకపూర్ – ఆలియా భట్ నటిస్తున్నారు. భూమి పెడ్నేకర్ ఓ కీలక పాత్రధారి. ఇదే చిత్రంలో రణవీర్ సోదరుడు లాంటి ఎనర్జిటిక్ బోయ్ విక్కీ కౌశల్ ఓ హీరో. బహుశా జాన్వీ అతడికి పెయిర్ గా కనిపిస్తుందేమో! ఇప్పటికైతే కథేమీ రివీల్ చేయలేదు కానీ సినిమా కాస్టింగ్ మాత్రం ఉత్కంఠ పెంచుతోంది.

ఎనర్జిటిక్ రణవీర్ సింగ్ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తోంది అన్నదే పెద్ద సర్టిఫికెట్. పద్మావత్ చిత్రంతో 600 కోట్ల క్లబ్ హీరోగా ఖాన్ లకు ధీటుగా తనని తాను ఆవిష్కరించుకున్నాడు రణవీర్. అందుకే ఇప్పుడు ధర్మప్రొడక్షన్స్ లో అతడు కథానాయకుడు .. వారియర్ హీరో అనగానే ఆసక్తి రెయిజ్ అయ్యింది. అప్పట్లో `భాజీరావ్ మస్తానీ`లో మిస్సయిన కరీనా ఈ చిత్రంతో తొలిసారి రణవీర్ సరసన నటిస్తోంది అన్నది మరో క్యూరియస్ పాయింట్. ఇలాంటి క్రేజీ వారియర్ హిస్టారికల్ సినిమాలో కపూర్ గాళ్ జాన్వీకి ఛాన్స్ అంటే రొట్టె విరిగి నెయ్యిలో పడ్డట్టే. కాదని అనగలరా?