ఆ జంట సీక్రెట్ ను రివీల్ చేసిన డైరెక్టర్!

0

సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తో 19 ఏళ్ల సంసార జీవితాన్ని గత సంవత్సరంలో మలైకా అరోరా ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెల్సిందే. అర్బాజ్ ఖాన్ – మలైకాల విడాకులకు ముఖ్య కారణం అర్జున్ కపూర్ అంటూ బాలీవుడ్ వర్గాల్లో మొదటి నుండి పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. అర్జున్ కపూర్ తో మలైకా ప్రేమాయణం సాగిస్తున్న కారణంగానే అర్బాజ్ ఖాన్ విడాకులు ఇచ్చి ఉంటాడని భావిస్తున్న సమయంలో ప్రస్తుతం మలైకా అరోరా – అర్జున్ కపూర్ ల వ్యవహారం బాలీవుడ్ లో వినిపిస్తున్న పుకార్లకు బలం చేకూర్చుతోంది.

గత కొన్ని రోజులుగా అర్జున్ కపూర్ మరియు మలైకా అరోరాలు తెగ తిరిగేస్తున్నాను. మొన్నటి వరకు రహస్యంగా ప్రేమాయణం సాగించిన వీరు ఇప్పుడు బహిరంగంగానే తిరిగేస్తున్నారు. వీరిద్దరు కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నా కూడా ఇప్పటి వరకు వీరిద్దరి ప్రేమాయణం గురించి అధికారికంగా క్లారిటీ అయితే రాలేదు. త్వరలో అర్జున్ కపూర్ – మలైకా అరోరాలు వివాహం చేసుకోబోతున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ విషయమై కరణ్ జోహార్ లీక్ చేశాడు.

బాలీవుడ్ సెలబ్రెటీలతో ఉండే టాక్ షో కాఫీ విత్ కరణ్ లో ఈ స్టార్ కపుల్ ల ప్రేమ – పెళ్లి విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షో లో అమీర్ ఖాన్ పాల్గొన్నాడు. అదే సమయంలో మలైకా అరోరా కూడా పాల్గొంది. ఆ టాక్ షో లో మలైకా అరోరా – అమీర్ ఖాన్ లు డాన్స్ చేశారు. ఆ సమయంలోనే మీరు త్వరలో మలైకా జీవితంలో జరుగబోతున్న ఒక కార్యక్రమంలో మరోసారి డాన్స్ చేయాల్సి ఉంటుంది అంటూ వ్యాఖ్యలు చేయడం – ఆ వెంటనే మలైకా మీరు ఆపండి అనడం జరిగింది. అంటే త్వరలోనే అర్జున్ కపూర్ – మలైకాల వివాహం జరగడం ఖాయం. మలైకా కంటే అర్జున్ కపూర్ వయసు రీత్యా చాలా చిన్న వాడు. అయినా కూడా వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.
Please Read Disclaimer