శ్రీదేవి కూతురితో మూడు సినిమాలా?

0Karan-Johar-Three-Filmsస్టార్స్ కిడ్స్ ని పరిచయం చేయాలన్నా ఒక మామూలు అమ్మాయిని స్టార్ గా మార్చలన్నా బాలీవుడ్లో కరణ్ జోహర్ ఒక్కడి వల్లనే అవుతుంది. ప్రేమ కుటంబ కథ చిత్రాల దర్శకుడు కరణ్ జోహర్ మరో అమ్మాయిని బాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడా? ఎప్పటి నుండో శ్రీదేవి పెద్ద కూతురు ‘ఝాన్వి కపూర్’ ఎంట్రీ జరుగుతుంది జరగబోతుంది అని టాక్ వస్తోంది కాని.. క్లారిటీ మాత్రం రావట్లేదు.

ఎవరు ఎలా అనుకున్న అధికారికంగా ప్రకటన చేయకపోయినా ఝాన్వి కపూర్ ని కరణ్ జోహర్ పరిచయం చేస్తునట్లు ఒక టాక్ ఉంది. అతని ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సీక్వెల్ లో నటించబోతుంది అని తెలుస్తోంది. ఆమే ఎలా ఉండాలో ఏమి చేయాలో అన్నీ కరణ్ జోహర్ దగ్గరుండి స్వయంగా గైడ్ చేస్తున్నాడట. ఈ కొత్త అమ్మాయితో మూడు సినిమాలు ఒప్పందం కూడా చేసుకున్నాడని ఒక రూమర్ వినిస్తోంది. మొత్తానికి శ్రీదేవి కూతురు పెద్ద ఛాన్స్ కొట్టినట్లే కదా. ఇప్పుడు వస్తున్న నటిస్తున్న ఏ హీరోయిన్ కు అంతటి భాగ్యం దక్కలేదు మరి. చాల మండి ఒక్క సినిమానైనా కరణ్ ప్రొడక్షన్లో చేయాలిని బాలీవుడ్ స్టార్స్ అందరూ అనుకుంటుంటే ఈ పిల్ల ఇంకా అడుగు పెట్టకుండానే మూడు సినిమాలు ఛాన్స్ కొట్టేసింది.

కరణ్ జోహర్ తన మిత్రుడు ఫార్ములాను ఫాలో అవుతునట్లు కనిపిస్తుంది ఈ విషయంలో. ఫిల్మ్ మేకర్ ఆదిత్య చోప్రా కూడా చాలాసార్లు ఇలానే డైరెక్టర్ నటులతో మూడు సినిమాల డీల్ సెట్ చేస్తాడు. డైరెక్టర్ కబీర్ ఖాన్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కరణ్ జోహర్ కూడా యాష్ రాజ్ ఫిల్మ్స్ లానే పెద్ద సినిమాలుతో పాటుగా చిన్న సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసే పనిలో ఉన్నాడు. మొన్న కపూర్ అండ్ సన్స్ కూడా అదే కోవలోకి వస్తుంది.