అబ్బ..ఒక నెలకు 50 వేలు ఇస్తానన్నాడు

0

కరాటే కల్యాణి అంటే ఇండస్ట్రీలో ఎవ్వరూ గుర్తుకుపట్టకు పోవచ్చు. కానీ కృష్ణ సినిమా అబ్బ.. బాబీ అనే డైలాగులతో బాగా పాపులర్ అయిన నటి కరాటే కల్యాణి. అంతకుముందు ఎన్నో సినిమాల్లో నటించినా కూడా కరాటే కల్యాణికి కృష్ణ సినిమా తర్వాతే మంచి గుర్తింపు వచ్చింది. రీసెంట్ గా జరిగిన మా ఎన్నికల్లో కరాటే కల్యాణి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని చెప్తూ.. కాస్టింగ్ కౌచ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌస్టింగ్ కౌస్ అనేది ఆడవాళ్లు పనిచేసే అన్నిచోట్లా ఉంటుందని.. కానీ ఇండస్ట్రీలో జరిగితే అదో పెద్ద వార్త అయిపోతుందని అన్నారు. కెరీర్ స్టార్టింగ్ లా తాను కూడా కాస్టింగ్ కౌచ్తో ఇబ్బందులు పడ్డానని చెప్పారు కరాటే కల్యాణి.

మన ప్రవర్తనని బట్టే ఎదుటివాళ్ల బిహేవియర్ ఆధారపడి ఉంటుంది. నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నైట్ ఫ్రీగా ఉంటావా – బయటకు వెళదామా అని అడిగేవారు. కేవలం సరదాకే కదా అని వెళ్లేదాన్ని. అలాంటి సమయంలో వారు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించేవారు. కానీ అలాంటి పనులని నేను ఎంకరేజ్ చేసేదాన్ని కాదు. మనం స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. నా కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీకి చేసిన ఓ వ్యక్తి నా అసభ్యంగా ప్రవర్తించాడు. నెలకు రూ.50 వేలు జీతం ఇస్తాను. నేను ఏది చెబితే అది చేయాలి. అందుకు తగ్గట్లుగా బాండ్ రాయమన్నాడు. నేను కుదరదని చెప్పా. తన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపొమ్మన్నాడు. ఆ తర్వాత వేరే ఇంటికి మారాను. అప్పుడు లొంగిపోయి ఉంటే ఇప్పుడు మీకు ఈ విషయం చెప్పే అవకాశమే ఉండేది కాదు. నాకు రూ.50 వేలు ఆఫర్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీ ఫేడౌట్ అయిపోయాడు” అని చెప్పింది కరాటే కల్యాణి
Please Read Disclaimer